Trump Nasa Crisis: ట్రంప్‌ దెబ్బతో సంక్షోభంలో నాసా… రాజీనామాకు సిద్దమైన 3,870 మంది ఉద్యోగులు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నిర్ణయాలు ఆ దేశ అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఉద్యోగుల కోత , రాజీనామాలతో నాసా తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. నాసా నుంచి 3870 మంది ఉద్యోగులు రాజీనామాకు సిద్దం కావడం సంచలనం రేపుతోంది...

Trump Nasa Crisis: ట్రంప్‌ దెబ్బతో సంక్షోభంలో నాసా...  రాజీనామాకు సిద్దమైన 3,870 మంది ఉద్యోగులు
Trump Effect On Nasa

Updated on: Jul 27, 2025 | 7:54 AM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నిర్ణయాలు ఆ దేశ అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఉద్యోగుల కోత , రాజీనామాలతో నాసా తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. నాసా నుంచి 3870 మంది ఉద్యోగులు రాజీనామాకు సిద్దం కావడం సంచలనం రేపుతోంది. నాసాలో పరిమితిని మించి ఉద్యోగులు ఉన్నారని , ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని ట్రంప్‌ చాలా రోజుల ముందే హెచ్చరికలు జారీ చేశారు. ట్రంప్‌ ఆదేశాల తరువాత నాసాలో ఉద్యోగాల కోత మొదలయ్యింది. నాసా నుంచి ఒకేసారి ఇంత మంది ఉద్యోగులు రాజీనామా చేయడం ఇదే తొలిసారి.

నాసాలో 14 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభం లోనే 870 మంది ఉద్యోగులు రాజీనామా చేశారు. దాదాపు 17 శాతం ఉద్యోగులను తగ్గించాలన్న లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు. ఉద్యోగుల రాజీనామాలు నాసా ప్రాజెక్ట్‌లను తీవ్రంగా ప్రభావితం చేస్తుందన్న భయం సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే నాసాలో ఎలాంటి సంక్షోభం లేదని , ఉద్యోగుల రాజీనామాల వ్యవహారం సంస్థ పనితీరుపై ఎలాంటి ప్రభావం చూపించదని నాసా చీఫ్‌ సీన్‌ డఫీ అన్నారు. నాసా పరిశోధనలు యధావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. కొంతమంది అవసరం లేని ఉద్యోగులను మాత్రమే తొలగిస్తునట్టు చెప్పారు.

1984లో కూడా నాసా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది. అప్పుడు కూడా చాలామంది ఉద్యోగులు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి వచ్చిందని చాలా మంది నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నాసా తాజా సంక్షోభం నుంచి ఎలా గట్టెక్కుతుందో చూడాలి. వాస్తవానికి నాసాలో పర్మినెంట్‌ ఉద్యోగులు చాలా తక్కువ. చాలామంది స్వచ్చంగా సంస్థ కోసం పనిచేస్తున్నారు. కాకపోతే వాలంటరీ ఉద్యోగులు తమ పదవులకు రాజీనామా చేయడం సంచలనం రేపింది.