Hairball in Stomach: ఎవరైనా ఆకలి వేస్తే వారి ఆహారపు అలవాట్లను అనుసరించి అన్నం, చపాతీ , పండ్లు ఇలా ఏది నచ్చితే అది తింటారు. అయితే ఓ యువతి మాత్రం తాను అందరికంటే డిఫరెంట్.. నా రూటే సెపరేట్ అంటూ వెంట్రుకలను తినేసింది.. ఈ ఘటన బ్రిటన్ లో చోటు చేసుకుంది.
కడుపు నొప్పితో ఆస్పత్రి లో చేరిన 17 ఏళ్ల బాలిక కడుపు నుంచి 48 సెంటీమీటర్ల హెయిర్‌బాల్‌ను యుకె వైద్యులు ఆపరేషన్ చేసి తొలగించారు. ఈ బాలిక రాపన్జెల్ సిండ్రోమ్‌తో బాధపడుతోందని తన సొంత జుట్టు తానె తినేస్తుందని వైద్యులు చెప్పారు. ఇలా జుట్టు తినడంతో జుట్టు ఓవల్ ఆకారంలో చుట్టుకుని హెయిర్ బాల్ లా తయారైంది.. దీంతో ఆ బాలిక గులు, కడుపు గోడలు చిరిగిపోయాయి. రెండు సార్లు మూర్ఛపోవడంతో బాలికను తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. ఆమె పడిపోయిన సమయంలో ముఖానికి, నుదిటి మీద గాయం కూడా అయింది. అయితే బాలిక పొత్తికడుపు వాపును డాక్టర్లు గుర్తించి వెంటనే CT స్కాన్ తీశారు. అప్పుడు బాలిక కడుపులోని వెంట్రుకల ఉండను చూసి షాక్ తిన్నారు.. అయితే బాలిక గత ఐదు నెలలుగా అప్పుడప్పుడు కడుపు నొప్పితో బాధపడుతుందని తల్లిదండ్రులు చెప్పారు. ఈసారి నొప్పితో కింద పడిపోవడంతో ఆస్పత్రికి తీసుకుని వచ్చినట్లు తెలిపారు. ఆపరేషన్ తర్వాత బాలిక క్షేమంగా ఉందని ఆస్పత్రి సిబ్బంది చెప్పారు.
Also Read: