Viral Video: శరీరానికి తక్షణ శక్తినిచ్చే ఆరోగ్యకరమైన పండ్లలో అతి ముఖ్యమైనది అరటిపండు అని మనందరికీ తెలిసిందే. అలాంటి ఒక అరటిపండు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ అరటిపండును చూసి మీరు కూడా ఒక్క క్షణంకు గురవుతారు. ఎందుకంటే ఒక మనిషి ఈ మొత్తం అరటిపండును తినలేడు. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అరటిపండు. ఈ పండు దాదాపు ఒక పసిబిడ్డ బరువుంది. ఏ ఒక్కరూ ఈ అరటిపండును పూర్తిగా తినటం వారి సామర్థ్యానికి మించినదే అవుతుంది. అయితే, ఆలస్యం చేయకుండా మీరు కూడా ఈ భారీ అరటిపండు గురించి తెలుసుకోండి..
మనక్ గుప్తా అనే వినియోగదారు ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇది చిన్న పిల్లల బరువుతో సమానంగా ఉందని చెప్పారు. వీడియోలో ఈ భారీ అరటిపండును చేతిలో పట్టుకుని తినడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఒక వ్యక్తి పూర్తిగా తినడం సాధ్యం కాదు. ఈ వీడియో ఆస్ట్రేలియన్ ద్వీపం పాపువా న్యూ గినియాలోని కొన్ని ప్రాంతాలను చూపిస్తుంది. అక్కడ ఈ రకమైన అరటి మొక్కను పెంచుతారు. దాని నుండి వచ్చే అరటి పండ్లు ఒక మూర పొడవు ఉంటాయి. ప్రస్తుతం ఈ భారీ అరటిపండు గిన్నిస్ బుక్‌లో నమోదైంది.
న్యూ పాపువా గినియాకు చెందిన ఈ అరటి మొక్కలను ప్రపంచంలోనే అతిపెద్ద అరటి మొక్కగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నమోదు చేసింది. ఈ మొక్క నుండి వచ్చే అరటి బరువు సుమారు 3 కిలోలు. ఇది నవజాత శిశువుతో సమానం. అయితే, ఈ పండు పండడానికి 5 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి పెద్దగా వ్యాపారం లేదు. ఈ మొక్క ట్రంక్ 15 మీటర్ల ఎత్తు ఉంటుందని, ఆకులు కూడా భూమి నుండి 20 మీటర్ల ఎత్తులో ఉన్నాయని చెబుతారు.
Whoa ? pic.twitter.com/96XLiVALyh
— Manak Gupta (@manakgupta) March 22, 2023
అయితే, ప్రపంచంలోనే అతిపెద్ద అరటిపండుకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ 38 సెకన్ల వీడియోను 88 వేలకు పైగా వీక్షించారు. అయ్యబాబోయ్ ఇంతపెద్ద అరటిపండా అని కొందరు నెటిజన్లు షాకింగ్ కామెంట్స్ పెట్టారు. 5 ఏళ్లలో పండే ఈ అరటిపండు తినడానికి కనీసం 5 రోజులు పడుతుందంటూ మరో వినియోగదారు వ్యాఖ్యానించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..