వార్నీ ఇదేక్కడి విచిత్రం.. నారింజ రంగులోకి మారుతున్న మంచినీటి మొసళ్లు.. వింతగా చూస్తున్న జనం..

|

Jun 07, 2023 | 10:58 AM

మొసళ్ల ఆరెంజ్ కలర్‌పై వారు అనేక సందేహాలను వ్యక్తం చేశారు. ఈ నారింజ రంగు ఎలిగేటర్లు, మొసళ్ల ఫోటోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. మొసళ్లకు ఈ వింత రంగు రావడానికి కారణం ఏంటో తెలుసుకోవాలని నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. మంచినీటి మొసళ్లు, ఎలిగేటర్‌లు నారింజ రంగులోకి మారుతున్నాయి. ఈ వింత రంగు జీవులను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు.

వార్నీ ఇదేక్కడి విచిత్రం.. నారింజ రంగులోకి మారుతున్న మంచినీటి మొసళ్లు.. వింతగా చూస్తున్న జనం..
Orange Crocodiles
Follow us on

మంచినీటి మొసళ్లు, ఎలిగేటర్‌లు నారింజ రంగులోకి మారుతున్నాయి. ఈ వింత రంగు జీవులను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. ఈ విచిత్ర సంఘటన నేపాల్‌లో చోటు చేసుకుంది. నేపాల్‌లో కనిపించే హిమాలయాల దిగువన ఉన్న రక్షిత ప్రాంతమైన చిత్వాన్ నేషనల్ పార్క్‌లో ఆరెంజ్ రంగు మొసళ్ళు కనిపించాయి. ఈ మొసళ్ల ఫస్ట్‌ ఫోటో ఒకటి మే 29న లీబ్నిజ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్‌వాటర్ ఎకాలజీ అండ్ ఇన్‌ల్యాండ్ ఫిషరీస్ పరిశోధకురాలు ఫోబ్ గ్రిఫిత్ షేర్ చేశారు. మొసళ్ల ఆరెంజ్ కలర్‌పై వారు అనేక సందేహాలను వ్యక్తం చేశారు. ఈ నారింజ రంగు ఎలిగేటర్లు, మొసళ్ల ఫోటోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. మొసళ్లకు ఈ వింత రంగు రావడానికి కారణం ఏంటో తెలుసుకోవాలని నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటివరకు, పెద్ద సంఖ్యలో మొసళ్ళు నలుపు, గోధుమ లేదా తెలుపు రంగులో మాత్రమే కనిపించాయి.

మొసళ్ల ఈ రంగును తెలుసుకోవడానికి, పరిశోధకుల బృందం ప్రాజెక్ట్ మెసిస్టాప్స్ సహాయం తీసుకుంది. ఐవరీ కోస్ట్‌లో, పశ్చిమ ఆఫ్రికా అంతటా అంతరించిపోతున్న స్లెండర్-స్నౌటెడ్ మొసలిని (మెసిస్టాప్స్ కాటాఫ్రాక్టస్) సంరక్షించడానికి, తిరిగి వాటి జనాభా పెంచడానికి ప్రాజెక్ట్ పని చేస్తోంది. మొసళ్లు నారింజ రంగులోకి మారడానికి ప్రధాన కారణం చిత్వాన్ నేషనల్ పార్క్‌లోని కొన్ని నదులు, నీటి ప్రవాహాలలో ఇనుము అధికంగా ఉండటమేనని ఆయన చెప్పారు. ఈ కారణంగానే వాటి శరీరం మొత్తం మీద నారింజ రంగు అంటుకుని, నల్లగా మారిందని చెబుతున్నారు. అటువంటి నీటి ప్రవాహాల దగ్గర ఎక్కువ సమయం గడిపే, వాటి నీటిని తాగే ఎలిగేటర్లు, మొసళ్లు వాటి రంగు నారింజ రంగులోకి మారుతున్నాయని ఫోబ్ గ్రిఫిత్ వివరించారు. చిత్వాన్‌లోని కొన్ని ప్రాంతాల్లోని నీటిలో ఐరన్‌ అధిక స్థాయిలో ఉందని, ఇనుము ఆక్సిజన్‌తో చర్య జరిపి ఐరన్ ఆక్సైడ్ అనే నారింజ పదార్థాన్ని ఏర్పరుస్తుందని కనుగొన్నారు.

ఇవి కూడా చదవండి

Gharials (Gavialis gangeticus) ఇలాంటి అరుదైన మంచినీటి మొసళ్ళు అంతరించిపోతున్నాయి. సాధారణంగా ఈ మొసళ్లు.. పొడవైన, సన్నని ముక్కును కలిగి ఉంటాయి.. మగ ఎలిగేటర్లు దాదాపు 16 అడుగుల (5 మీ) పొడవు వరకు పెరుగుతాయి. వాటి బరువు 250 కిలోల వరకు ఉంటుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..