కరోనా.. పేరు చెబితే చాలు.. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటికే 1800మందికి పైగా మరణించారు. మరో 70వేల మందికిపైగా ఈ వైరస్ సొకి తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. ప్రస్తుతం 20 దేశాలకు పైగా ఈ కరోనా లక్షణాలు కన్పించడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఇదంతా ఇలా ఉంటే.. కరోనా బారిన పడకుండా ఉండేందుకు మాస్క్‌లు, చేతులు కడిగాక తుడుచుకునేందుకు ఉపయోగించే నాప్ కిన్స్, టాయి లెట్ పేపర్స్ వాడకం ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో వీటి ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి. దీంతో దొంగలు వీటిని చోరి చేసేందుకు సిద్ధమయ్యారు. మొన్నటికి మొన్న.. హాంకాంగ్‌లో పెద్ద ఎత్తున టాయిలెట్ రోల్స్ చోరి జరిగాయి. తాజాగా జపాన్‌లో మాస్క్‌లను చోరిచేశారు దుండగులు. కోబ్ నగరంలో గల ఓ రెడ్‌క్రాస్ ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. దాదాపు 6000 సర్జికల్ మాస్క్‌లను దొంగలు ఎత్తుకెళ్లారు. ఆసుపత్రిలోని స్టోరేజ్ రూం నుంచి వీటిని చోరిచేశారు. సాధారణంగానే జపాన్‌లో మాస్క్‌ల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఇకఇప్పుడు కరోనా ఎఫెక్ట్‌తో మరింత ఎక్కువ వినయోగం పెరిగింది. అదేసమయంలో వీటి ధరలు కూడా నింగినంటుతున్నాయి.