వైరస్‌ మూలాన్ని కనుగొనేందుకు.. చైనాకు డబ్ల్యూహెచ్‌ఓ బృందం

| Edited By:

Jun 30, 2020 | 4:39 PM

కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్‌ వ్యాప్తి మూలాన్ని పరిశోధించడానికి వచ్చే వారం తమ బృందం చైనాకు వెళ్ల‌నుంద‌ని సంస్థ చీఫ్‌ టెడ్రోస్ అధ‌నామ్ గేబ్రేయేస‌స్ తెలిపారు.

వైరస్‌ మూలాన్ని కనుగొనేందుకు.. చైనాకు డబ్ల్యూహెచ్‌ఓ బృందం
Follow us on

కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్‌ వ్యాప్తి మూలాన్ని పరిశోధించడానికి వచ్చే వారం తమ బృందం చైనాకు వెళ్ల‌నుంద‌ని సంస్థ చీఫ్‌ టెడ్రోస్ అధ‌నామ్ గేబ్రేయేస‌స్ తెలిపారు. క‌రోనా వైరస్ వ్యాప్తికి చైనానే కారణమని అమెరికా సహా పలు దేశాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో డబ్ల్యూహెచ్ఓ  బృందాన్ని చైనాకు పంపి దర్యాప్తు జరపాలని అమెరికా విమర్శలు కురిపిస్తుండగా.. డబ్ల్యూహెచ్ఓ  కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా  టెడ్రోస్ మాట్లాడుతూ.. ప్ర‌పంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంపై డబ్ల్యూహెచ్‌ఓ ఆందోళ‌‌న వ్య‌క్తం చేస్తోంద‌ని అన్నారు. ఈ పరిస్థితుల్లో వైరస్ వ్యాప్తి ఎక్కడి నుంచి మొదలైందో తెలుసుకోవడం చాలా కీలకమని ఆయన తెలిపారు. వైరస్‌ మూలం ఎలా మొదలైందో తెలిస్తేనే వైరస్‌తో పోరాడగలమని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసమే చైనాకు వెళ్లేందుకు ఓ బృందాన్ని సిద్ధం చేస్తున్నట్లు టెడ్రోస్‌ వెల్లడించారు.