చావుదెబ్బ తిన్నా, తీరు మారని పాక్.. భారత్‌ను మళ్లీ హెచ్చరించిన పాక్‌ మేజర్ జనరల్‌!

చావుదెబ్బ తిన్నా తీరు మారలేదు. భారత్‌ దాడులతో బెంబేలెత్తిపోయినా పాక్‌ మారలేదు. ఆ దేశానికి చెందిన సైనికాధికారి అడ్డగోలుగా మాట్లాడారు. భారతదేశం ఉగ్రవాద శిబిరాలను కూల్చివేసిన తర్వాత పాకిస్తాన్ దుష్ట నీతిని బహిర్గతం చేయడానికి ప్రపంచ దౌత్యపరమైన మెరుపుదాడిని ప్రారంభించింది భారత్. అయినా పాక్ పాలకులకు ఏమాత్రం బుద్ధి రాలేదు.

చావుదెబ్బ తిన్నా, తీరు మారని పాక్.. భారత్‌ను మళ్లీ హెచ్చరించిన పాక్‌ మేజర్ జనరల్‌!
Pakistani Lieutenant General Ahmed Sharif Chaudhry

Updated on: May 23, 2025 | 12:47 PM

చావుదెబ్బ తిన్నా తీరు మారలేదు. భారత్‌ దాడులతో బెంబేలెత్తిపోయినా పాక్‌ మారలేదు. ఆ దేశానికి చెందిన సైనికాధికారి అడ్డగోలుగా మాట్లాడారు. భారతదేశం ఉగ్రవాద శిబిరాలను కూల్చివేసిన తర్వాత పాకిస్తాన్ దుష్ట నీతిని బహిర్గతం చేయడానికి ప్రపంచ దౌత్యపరమైన మెరుపుదాడిని ప్రారంభించింది భారత్. అయినా పాక్ పాలకులకు ఏమాత్రం బుద్ధి రాలేదు.

పాకిస్తాన్ సైనిక ప్రతినిధి ఉగ్రవాదుల భాషలో మాట్లాడుతున్నట్లు కనిపించింది. పాక్‌ వర్సిటీలో నిర్వహించిన సభలో, ప్రస్తుతం ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) 22వ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్న పాకిస్తాన్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి భారత్‌ను మళ్లీ హెచ్చరించారు. ఆయన నోట మరోసారి ప్రపంచ ఉగ్రవాది మాటలను ప్రతిధ్వనించారు. భారత్‌పై ప్రపంచ ఉగ్రవాది హఫీజ్ సయీద్ చేసిన వ్యాఖ్యలనే షరీఫ్ చౌదరి నోట వెలువడ్డాయి. భారతదేశం సింధు జలాల ఒప్పందం(ఐడబ్ల్యుటి) నిలిపివేయడంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. “మీరు మా నీటిని అడ్డుకుంటే, మేము మీ ఊపిరిని అడ్డుకుంటాము” అని అన్నారు.

వీడియో చూడండి..

అహ్మద్ షరీఫ్ చౌదరి ప్రకటన లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) చీఫ్ , 26/11 దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ దీర్ఘకాలంగా చేస్తున్న వాక్చాతుర్యాన్ని ప్రతిధ్వనిస్తుంది. ఆసక్తికర విషయం ఏమంటే, షరీఫ్ చౌదరి తన తండ్రికి ఒసామా బిన్ లాడెన్‌తో ఉన్న సంబంధాల కారణంగా విచారణను ఎదుర్కొంటున్నాడు. 9/11 ముంబై దాడుల తర్వాత వారాల్లో ఆయన ప్రపంచ ఉగ్రవాద నిఘా సంస్థల పరిశీలనలో ఉన్నాడు.

పహల్గామ్ దాడి జరిగిన ఒక రోజు తర్వాత, పాకిస్తాన్‌పై విధించిన శిక్షాత్మక చర్యలలో సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం వహించిన సింధు జలాల ఒప్పందం కుదిర్చింది. 1960 నుండి భారతదేశం-పాకిస్తాన్ మధ్య సింధు నది తోపాటు దాని ఉపనదుల నీటి పంపిణీ, వినియోగాన్ని నియంత్రిస్తోంది. పహల్గామ్‌లో దారుణమైన ఉగ్రవాద దాడి తరువాత పాకిస్తాన్ నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది పాక్. ఈ ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించిన ప్రపంచ బ్యాంకు కూడా ప్రస్తుత వివాదాన్ని పరిష్కరించడానికి జోక్యం చేసుకోదని స్పష్టం చేసింది.

పహల్గామ్ దాడితో సరిహద్దు ఉగ్రవాద సంబంధాలకు ప్రతిస్పందనగా మే 7న భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ ప్రారంభించింది. ప్రధానంగా మూడు స్పష్టమైన లక్ష్యాలు.. సైనిక, రాజకీయ, మానసిక వంటి మూడింటినీ అధిగమించారు. ఈ క్రమంలోనే యూసుఫ్ అజార్, అబ్దుల్ మాలిక్ రౌఫ్, ముదాసిర్ అహ్మద్ వంటి అగ్రనేతలతో సహా 100 మందికి పైగా ఉగ్రవాదులను ఈ ఆపరేషన్‌లో విజయవంతంగా నిర్మూలించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం ఇప్పుడు 33 దేశాలకు దౌత్యపరమైన ప్రపంచవ్యాప్త చర్యను ప్రారంభించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..