సాధారణ జలుబు(Cold Virus) వంటి శ్వాస సంబంధిత వైరస్ వల్ల చిన్నారుల్లో భారీగా మరణాలు నమోదవుతున్నాయని ది లాన్సెట్ జర్నల్ వెల్లడించింది. జలుబు వంటి లక్షణాలకు కారణమయ్యే ఓ సాధారణ వైరస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఒక్క ఏడాదే లక్ష మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపింది. ఈ వైరస్ ను రెస్పిరేటరీ సైన్‌సైటియల్ వైరస్ (RSV) గా గుర్తించారు. దీని ప్రభావాన్ని అంచనా వేసేందుకు బ్రిటన్ పరిశోధకులు తాజా అధ్యయనం చేపట్టారు. ఆర్‌ఎస్‌వీ వైరస్ బారిన పడుతున్న ప్రతి ఐదుగురిలో ఒకరు చనిపోతున్నట్లు తెలిపారు. వైద్య సదుపాయం బాగా ఉన్న ప్రాంతాల్లో ఈ వైరస్ ప్రభావం తక్కువగా ఉన్నా.. పేద దేశాల్లోనే ఈ వైరస్ ప్రభావం అధికంగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. 2019లోనే 3.3కోట్ల కేసులు నమోదయ్యాయి. వీరిలో 36లక్షల మంది ఆస్పత్రుల్లో చేరారు. అందులో 26,300 మంది ఆస్పత్రుల్లోనే మరణించారు. ఆ ఏడాది మొత్తంగా 1,01,400 ఆర్‌ఎస్‌వీ సంబంధిత మరణాలు సంభవించాయి. కమ్యూనిటీ స్థాయిలోనే 80శాతం మరణాలు జరుగుతున్నట్లు తాజా అధ్యయనం పేర్కొంది.
ఆరు నెలల చిన్నారులు, యుక్తవయసు పిల్లలకు ముప్పు అధికంగా ఉన్నట్లు అంచనా వేస్తున్నామని యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్‌బర్గ్‌కు చెందిన నిపుణులు హరీశ్ నాయర్ పేర్కొన్నారు. అయితే కొవిడ్ ఆంక్షలు సడలిస్తోన్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా కేసులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గడిచిన రెండేళ్లలో పుట్టిన చిన్నారుల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని.. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వారు ఈ వైరస్ బారినపడలేదని వ్యాఖ్యానించారు. దీంతో ఈ వైరస్‌ను ఎదుర్కొనే రోగనిరోధకత వారిలో వృద్ధి కాలేదని హరీశ్ నాయర్ వెల్లడించారు.
మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవీ చదవండి
Venkaiah Naidu: సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఉపరాష్ట్రపతి.. డబుల్ మీనింగ్‌లపై..
Vikram: రామ్ చరణ్ విడుదుల చేసిన కమల్ హాసన్ యాక్షన్ థ్రిల్లర్ విక్రమ్ ట్రైలర్