ట్రంప్ ఫ్లైట్ ఆకాశంలో ఉండగా, అకస్మాత్తుగా దగ్గరగా వచ్చిన ప్రయాణీకుల విమానం.. తరువాత ఏమి జరిగిందంటే?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండవసారి UK పర్యటన సందర్భంగా ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో లండన్ వైపు వెళుతుండగా, స్పిరిట్ ఎయిర్‌లైన్స్ ప్యాసింజర్ విమానం.. ట్రంప్ విమానానికి చాలా దగ్గరగా వెళ్ళింది. ఈ ఘటన న్యూయార్క్ మీదుగా వెళ్తుండగా జరిగినట్లు సమాచారం.

ట్రంప్ ఫ్లైట్ ఆకాశంలో ఉండగా, అకస్మాత్తుగా దగ్గరగా వచ్చిన ప్రయాణీకుల విమానం.. తరువాత ఏమి జరిగిందంటే?
Donald Trump's Air Force One

Updated on: Sep 18, 2025 | 9:49 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండవసారి UK పర్యటన సందర్భంగా ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో లండన్ వైపు వెళుతుండగా, స్పిరిట్ ఎయిర్‌లైన్స్ ప్యాసింజర్ విమానం.. ట్రంప్ విమానానికి చాలా దగ్గరగా వెళ్ళింది. ఈ ఘటన న్యూయార్క్ మీదుగా జరిగింది. విమానాలు మైళ్ల దూరంలో ఉండి ఎటువంటి ప్రమాదం జరగనప్పటికీ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు స్పిరిట్ ఎయిర్‌లైన్స్ పైలట్‌లను దిశను మార్చుకోవాలని ఆదేశించారు. దీంతో అంతా ఉపిరి పీల్చుకున్నారు.

ప్రముఖ మీడియా కథనం ప్రకారం, స్పిరిట్ ఫ్లైట్ 1300 ఫోర్ట్ లాడర్‌డేల్ నుండి బోస్టన్‌కు బయలుదేరింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ పైలట్‌లతో పదే పదే, “స్పిరిట్ 1300, వెంటనే 20 డిగ్రీలు కుడివైపు తిరగండి” అని సూచించారు. కంట్రోలర్ కూడా సరదాగా, “ఐప్యాడ్ వదిలి విమానంపై దృష్టి పెట్టండి” అని అన్నాడు. విమానం దిశ మార్చుకోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది.

ఎయిర్ ఫోర్స్ వన్-స్పిరిట్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 1300 దాదాపు 11 మైళ్ల (సుమారు 18 కిలోమీటర్లు) దూరంలో ఎదురెదురుగా వచ్చాయని ఫ్లైట్ రాడార్ డేటా చూపించింది. ట్రంప్ లండన్ చేరుకున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. ఇదెలావుంటే, లండన్‌లో “స్టాప్ ది ట్రంప్ కోయలిషన్” అనే నిరసన కూడా జరుగుతోంది. నిరసనలను నియంత్రించడానికి, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించడానికి దాదాపు 1,600 మంది పోలీసు అధికారులను మోహరించారు.

అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ తోపాటు అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ సురక్షితంగా లండన్ చేరుకున్నారు. వారిని ప్రిన్స్ విలియం, కేట్ మిడిల్టన్ స్వాగతించారు. ఆ తర్వాత వారిని విండ్సర్ కోటకు తీసుకెళ్లారు. అక్కడ రాజు చార్లెస్ వారిని రాష్ట్ర గౌరవాలతో ఆహ్వానించారు. అధ్యక్షుడు ట్రంప్ తో రాజు చార్లెస్ కీలక సమావేశం నిర్వహిస్తారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..