Sri Lanka – China: భారత అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ శ్రీలంకలోని హంబన్‌టోటలో మకాం వేసిన చైనా అత్యాధునిక నిఘా నౌక యువాన్ వాంగ్ 5 తిరుగు ప్రయాణమైంది. గగనతల నిఘా ఉపగ్రహాలు, బాలిస్టిక్ క్షిపణుల కదలికలను పసిగట్టే సామర్థ్యం ఉన్న ఈ నౌక శ్రీలంకకు రావడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినా లంకకు వచ్చిన ఈ నౌక ఆరు రోజుల తర్వాత చైనాకు పయనమైంది.
యువాన్ వాంగ్ 5 నౌక ఆగస్టు 16 ఉదయం 8.20 నిమిషాలకు హంబన్‌టోట ఓడరేవుకు చేరుకుంది. ఇంధనం నింపడం సహా మరికొన్ని సాధారణ పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఆగస్టు 22 సాయంత్రం నాలుగు గంటలకు శ్రీలంక నుంచి చైనా బయల్దేరిందని లంక అధికారులు ప్రకటించారు. ఈ నౌక చైనాలోని జియాంగ్‌యిన్ పోర్ట్‌కు చేరుకుంటుందని చెప్పారు. నౌక హంబన్‌టోట పోర్టులో ఉన్న ఆరు రోజులు చైనా రాయబార కార్యాలయం కోరిన సాయాన్ని అందించామని లంక నౌకాదళం వెల్లడించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..