మయన్మార్ లో చైనీస్ ఫ్యాక్టరీలకు నిప్పు, దుండగుల కాల్పుల్లో అనేక మంది మృతి, పలువురికి గాయాలు

| Edited By: Anil kumar poka

Mar 15, 2021 | 11:39 AM

మయన్మార్ లో ఉన్నట్టుండి చైనీయులకు చెందిన ఫ్యాక్టరీలకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు.  ఈ సందర్భంగా జరిగిన ఘర్షణల్లోనూ, సైన్యానికి వ్యతిరేకంగా నిరసనకారులు...

మయన్మార్ లో చైనీస్ ఫ్యాక్టరీలకు నిప్పు, దుండగుల కాల్పుల్లో  అనేక మంది  మృతి,  పలువురికి గాయాలు
Chinese Financed Factoriesset On Fire In Mayanmar
Follow us on

మయన్మార్ లో ఉన్నట్టుండి చైనీయులకు చెందిన ఫ్యాక్టరీలకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు.  ఈ సందర్భంగా జరిగిన ఘర్షణల్లోనూ, సైన్యానికి వ్యతిరేకంగా నిరసనకారులు చెలరేగగా వారిని చెదర గొట్టేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లోనూ  మొత్తం 39 మంది  మరణించగా. పలువురు గాయపడ్డారు.  ముఖ్యంగా యాంగంగ్ శివారులోని లైంగ్ తాయా సిటీలో చైనాకు చెందిన ఫ్యాక్టరీలను టార్గెట్ గా చేసుకుని దుండగులు రెచ్చిపోయారు. ఈ దాడుల్లో తమ దేశానికి చెందిన సిబ్బంది గాయపడడం పట్ల చైనా ఎంబసీ తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేసింది.లైంగ్ తాయా నగరంలో చైనా దేశానికి చెందిన పలు గార్మెంట్ (బట్టల) ఫ్యాక్టరీలు ఉన్నాయి. తమ పౌరులను, ఆస్తులను రక్షించాలని చైనా ఎంబసీ..సైనిక ప్రభుత్వాన్ని కోరింది. ఈ మిలిటరీ ప్రభుత్వానికి చైనా మద్దతు నిస్తోందని చెబుతున్నారు. బహుశా దీన్ని దృష్టిలో పెట్టుకునే దుండగులు (చైనా వ్యతిరేక శక్తులు) ఈ దాడులకు పాల్పడినట్టు భావిస్తున్నారు. అటు.. ఇతర దేశాల  నుంచి వస్తున్న శరణార్ధులను కూడా వీరు వదలలేదని తెలుస్తోంది. చైనీయులకు చెందిన  నాలుగు బట్టల ఫ్యాక్టరీకి, ఓ ఎరువుల కర్మాగారానికి  గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారని, మంటలు ఆర్పేందుకు వస్తున్న ఫైరింజన్లను సుమారు 2 వేలమంది అడ్డుకున్నారని వార్తలు వచ్చాయి.కాగా- ఈ ఘటనలకు తామే బాధ్యులమని ఏ గ్రూప్ కూడా ప్రకటించుకోలేదు.

మరోవైపు.. మిలిటరీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని, ప్రజా నేత ఆంగ్ సాన్ సూకీని జైలు నుంచి విడుదల చేయాలని కోరుతూ నిరసనకారులు యాంగాంగ్ సిటీలో భారీ ర్యాలీ నిర్వహించారు. వీరిని చెదరగొట్టేందుకు పోలీసులు, సైన్యం జరిపిన కాల్పుల్లో 22 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు ఈ ఘటనల్లో  మృతి చెందినవారి సంఖ్య 126 కి పెరిగింది. లైంగ్ తాయా లోను, యాంగంగ్ లోను మార్షల్ లా విధించినట్టు సైనికవర్గాలు తెలిపాయి. శనివారం నాడు రెండువేలమందికి పైగా నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ దేశంలో అధికార పగ్గాలను సైన్యం చేపట్టినప్పటి నుంచి చైనా వ్యతిరేక ధోరణులు పెరిగిపోయాయి.

మరిన్ని చదవండి ఇక్కడ :శోభనానికి అంగీకరించని భార్య ఆరాతీస్తే విస్తుపోయే నిజాలు.. షాక్ అయిన భర్త..! : Wedding viral Video

‘నా సావు నేను చస్తా’ డైరెక్టర్‌గా ప్రియదర్శి : Comedian Priyadarshi to turn Director Video.

ఒక్క ఫోన్‌కాల్… అడ్డంగా బుక్కైన యువతి ఇంత సులభంగా అంత మోసం.: woman Loss 6.4 Lakhs Video.