China – Taiwan: తైవాన్ చుట్టూ చైనా దళాలు.. ద్వీపం చుట్టూ భారీగా యుద్ధ విమానాలు, నౌకల మోహరింపు.. తైపీ ఆందోళన

|

Sep 18, 2023 | 10:49 AM

China Taiwan relations: చైనా, తైవాన్ మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. గత కొంతకాలం నుంచి చైనా - తైవాన్ మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆనాటి నుంచి చైనా ద్వీప దేశమైన తైవాన్ ను టార్గెట్‌ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో చైనా మరోసారి దూకుడు ప్రదర్శించింది. తైవాన్ చుట్టూ చైనాకు చెందిన యుద్ధ విమానాలు చక్కెర్లు కొట్టాయి.

China - Taiwan: తైవాన్ చుట్టూ చైనా దళాలు.. ద్వీపం చుట్టూ భారీగా యుద్ధ విమానాలు, నౌకల మోహరింపు.. తైపీ ఆందోళన
China Taiwan Relations
Follow us on

China Taiwan relations: చైనా, తైవాన్ మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. గత కొంతకాలం నుంచి చైనా – తైవాన్ మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆనాటి నుంచి చైనా ద్వీప దేశమైన తైవాన్ ను టార్గెట్‌ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో చైనా మరోసారి దూకుడు ప్రదర్శించింది. తైవాన్ చుట్టూ చైనాకు చెందిన యుద్ధ విమానాలు చక్కెర్లు కొట్టాయి. 24 గంటల వ్యవధిలో ద్వీపం చుట్టూ 103 చైనా యుద్ధ విమానాలను గుర్తించినట్లు తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. కుట్రపూరిత ఆలోచనతోనే అవి తైవాన్ జలసంధిలోని మధ్యస్థ రేఖను దాటాయని.. ఒకేసారి యుద్ధ విమానాలన్నీ చక్కెర్లు కొట్టినట్లు తైపీ అధికారులు వెల్లడించారు.

ఆదివారం, సోమవారం ఉదయం మధ్య తైవాన్ చుట్టూ 103 PLA విమానాలు, 9 PLAN నౌకలు కనుగొన్నట్లు తైవాన్ ప్రకటించింది. తైపీ చుట్టూ చైనా వైమానిక దళం, నౌకాదళాన్ని ప్రస్తావిస్తూ తైపీ ఒక ప్రకటన విడుదల చేసింది. చైనా సైన్యం క్రమం తప్పకుండా తైవాన్‌కు దక్షిణం, పశ్చిమాన జలాలపై విమానాలను పంపుతుంది. 40 విమానాలు ఆదివారం, సోమవారం తెల్లవారుజామున తైవాన్, చైనా ప్రధాన భూభాగం మధ్య సింబాలిక్ మధ్యస్థ రేఖను దాటినట్లు ద్వీప రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

కాగా.. తైవాన్ స్వయం ప్రతిపత్తి కలిగిన ద్వీప దేశం.. ఇరుగు పొరుగు దేశాలైన చైనా, తైవాన్ మధ్య సంబంధాలు దెబ్బతినడంతోనే బీజింగ్ డెమోక్రటిక్ తైవాన్‌ను తన స్వంత భూభాగంగా ప్రకటించుకుంటోంది. దీన్ని తైపీ వ్యతిరేకిస్తోంది. ఈ క్రమంలో తైవాన్ బలవంతంగా స్వాధీనం చేసుకునేందుకు చైనా కుట్ర చేస్తోందని… అందులో భాగంగానే సైనికపరమైన, దౌత్యపరమైన ఒత్తిడిని పెంచిందని తైపీ అధికారులు పేర్కొంటున్నారు.

అయితే, తైపీపై చైనా ఆధిపత్యం తరువాత అమెరికా, కెనడాకు చెందిన రెండు నౌకలు ఈ నెలలో తైవాన్ జలసంధి వద్ద విహరించి ద్వీపదేశానికి అండగా నిలిచే ప్రయత్నం చేశాయి. ఈ నేపథ్యంలో చైనా దళాలు మరింత అప్రమత్తమయ్యాయి.. దీనిలో భాగంగానే చైనా దళాలు తమ దేశం సరిహద్దుల్లో మోహరిస్తున్నాయని తైపే రక్షణశాఖ వెల్లడించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..