China Floods: భారీ వర్షాలతో విలవిలలాడుతున్న చైనా.. వందేళ్లలో ఎన్నడూ లేనంతగా..

|

Jun 23, 2022 | 10:33 PM

China Floods: భారీ వర్షాలతో చైనాలోని పలు ప్రావిన్స్‌లు విలవిలలాడతున్నాయి. పెర్ల్ నదికి వందేళ్లలో ఎన్నడూ లేనంతగా వరదలు వచ్చి జనావాసాలు

China Floods: భారీ వర్షాలతో విలవిలలాడుతున్న చైనా.. వందేళ్లలో ఎన్నడూ లేనంతగా..
China Floods
Follow us on

China Floods: భారీ వర్షాలతో చైనాలోని పలు ప్రావిన్స్‌లు విలవిలలాడతున్నాయి. పెర్ల్ నదికి వందేళ్లలో ఎన్నడూ లేనంతగా వరదలు వచ్చి జనావాసాలు మునిగిపోయాయి. గ్వాంగ్‌డాంగ్, జియాంగ్జీ, ఫుజియాన్ ప్రావిన్స్‌లలో రికార్డు స్థాయి వర్షాలు కురిశాయి. దీంతో పెర్ల్‌ నదీ తీర ప్రాంతమంతా వరదలతో పోటెత్తింది. గత వందేళ్లలో ఎన్నడూ లేనంతా ఈ నదిలో నీటి మట్టం పెరిగిపోయింది. 1915, 1931 ఏడాది రికార్డులను అదిగమించింది.. దీంతో షావోగ్వాన్ నగరంలోని వీధులు కాలువలను తలపించాయి. పలు నివాస ప్రాంతాలు నీట మునిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లక్షలాది మంది ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలను తరలించారు.

చైనాలో అతిపెద్ద లాజిస్టిక్‌ కేంద్రమైన గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌ రాజధాని గ్వాంగ్‌జౌపై కూడా వరదలు తమ ప్రభావాన్ని చూపించాయి.. చాలా ప్రాంతాల్లో ఇళ్లతో పాటు కార్లు నీట మునిగి కనిపించాయి.. ఇదే ఫ్రావిన్స్‌లో ఉన్న చైనా టెక్‌ రాజధానిగా పిలిచే షెన్‌జెన్‌ కూడా వరదల్లో చిక్కుకుంది. వీధులు, షాపులు బురద మేటలు వేసి కనిపించాయి.. ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీలను మూసేయడంతో పాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.. వరదలు భారీ నష్టాన్ని మిగిల్చాయని అధికారులు చెబుతున్నారు. సెంట్రల్‌ చైనాలో ఉన్న జియాంగ్జీ ప్రావిన్స్‌ షాంగ్రో, గ్వాంగ్జి నగరాలతో పాటు పలు చోట్ల రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. చైనాలోని కొన్ని ప్రాంతాల్లో వేసవి కాలంలో వర్షాలు పడటం సాధారణమే అయినా ఈ స్థాయిలో ఎప్పుడూ చూడలేదంటున్నారు స్థానికులు.