China Corona: గత మూడేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచ దేశాలకు చాపకింద నీరులా పాకింది. దీంతో అన్ని దేశాలు కూడా కరోనాతో తీవ్ర స్థాయిలో నష్టపోయాయి. ఎంతో కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. కరోనా కట్టడికి ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్యలు చేపట్టింది. కరోనా ఆంక్షలు, లాక్‌డౌన్ తదితర చర్యలు చేపట్టింది. దీంతో కరోనాను అరికట్టేందుకు యుద్ధప్రతిపాదికన వ్యాక్సిన్‌ను అందుబాటులోకి వచ్చింది. అన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగి అందరికి టీకాలు అందేలా చర్యలు చేపట్టాయి. ఫస్ట్, సెకండ్ డోసుల తర్వాత బూస్టర్ డోస్‌ను వేస్తున్నాయి ప్రభుత్వం. ఇక కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతం ఎవరి పనులు వారు సజావుగా చేసుకుంటున్నారు. ఇప్పుడు చైనాలో పూర్తిగా తగ్గుముఖం పట్టిన వైరస్.. తాజాగా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. అక్కడ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో చైనాలోని 70 నగరాల్లో కరోనా ఆంక్షలు విధించింది ప్రభుత్వం. ఈ లాక్‌డౌన్ ప్రభుత్వం ఆరున్నకోట్ల మందిపై ప్రభావం చూపనుంది. వరుస ప్రయాణాలు, సెలవులపై ఆంక్షలు విధించింది. కరోనా నియంత్రణ కోసం ఈ లాక్‌డౌన్ విధిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.
భారత్‌లో తగ్గిన కరోనా కేసులు..
భారత్‌లో ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. సోమవారం ఉదయం దేశ వ్యాప్తంగా 5910 కేసులు నమోదు కాగా, 16 మంది మృతి చెందినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు దేశంలో 4,44,62,445 కేసులు నమోదు కాగా, మరణాల సంఖ్య 5,28,007కు చేరింది. కరోనా నుంచి 7,034 మంది కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 4,38,80,464కు చేరింది. మొత్తం కేసుల్లో 0.12 శాతం కేసులు యాక్టివ్‌గా ఉండగా, రికవరీ రేటు 98.69, మరణాల రేటు 1.19 ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి