చాణక్య నీతి: ఈ వ్యక్తుల మధ్య ఎప్పుడూ దూరకండి, లేదంటే చిక్కుల్లో పడతారు

ఆచార్య చాణక్యుడు అనేక మానవ సమస్యలకు తన నీతి శాస్త్రం, ఆర్థిక శాస్త్రం పుస్తకాల ద్వారా పరిష్కారం చూపారు. ఎప్పుడూ కొందరికి దూరంగా ఉంటే మంచిదని చెప్పారు. గొడవపడుతున్న వ్యక్తులు, మాట్లాడుకుంటున్న వ్యక్తల మధ్య సంబంధం లేకున్నా మీరు వెళితే ప్రతికూల అనుభవాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

చాణక్య నీతి: ఈ వ్యక్తుల మధ్య ఎప్పుడూ దూరకండి, లేదంటే చిక్కుల్లో పడతారు
Chanakya

Updated on: Jan 10, 2026 | 6:59 PM

భారత ఆర్థిక, నీతి శాస్త్ర పితామహుడిగా పేరొందిన ఆచార్య చాణక్యుడు మానవులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం చూపారు. జీవితంలో వ్యక్తులు ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? అనే విషయాలను స్పష్టంగా తెలియజేశారు. ఉదాహరణకు చాణక్య తన పుస్తకంలో ఈ ప్రపంచంలో కొన్ని ఉన్నాయని.. మీరు వాటిని నిద్ర నుంచి లేపితే మీరు చనిపోవచ్చు అని హెచ్చరించారు. మీరు అడవిలో నడకకు వెళ్లినప్పుడు సింహం నిద్రపోతుంటే.. దాన్ని లేపితే.. అది మిమ్మల్ని వేటాడుతుందని చాణక్యుడు చెప్పారు.

ఇంకా, రాజు నిద్ర ఎప్పుడు చెడగొట్టవద్దు.. రాజు నిద్రను చెడగొడితే అతను కోపంతో మరణశిక్షను కూడా విధించవచ్చు. మీరు ఎప్పుడూ ఇలాంటి వారి నిద్రను చెడగొట్టకూడదని చాణక్యుడు స్పష్టం చేశారు. అలాగే మరికొంతమంది మాట్లాడుకుంటున్నప్పుడు లేదా పొట్లాడుకుంటున్నప్పుడు వారి మధ్యకు వెళ్లవద్దని చాణక్యుడు సూచించారు.

సేవకుడు, యజమాని మధ్య

ఒక సేవకుడు, యజమాని మాట్లాడుకుంటున్నప్పుడు.. మూడవ వ్యక్తి దానిలో ఎప్పుడూ జోక్యం చేసుకోకూడదు. లేదా మధ్యవర్తిత్వం వహించకూడదు అని చాణక్యుడు చెప్పారు. ఎందుకంటే, వారి వ్యక్తిగత విషయం, మీరు దానిలో జోక్యం చేసుకుంటే.. ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. అలాగే, అలాంటి చోట మీరు అవమానించబడే అవకాశం ఉంది కాబట్టి.. సేవకుడు, యజమాని మాట్లాడుకుంటున్నప్పుడు ఎప్పుడూ జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించవద్దని చాణక్యుడు సూచించారు.

ఇద్దరు పండితుల మధ్య సంభాషణ

ఇద్దరు పండితులు సంభాషణ చేస్తున్నప్పుడు మరో వ్యక్తి జోక్యం చేసుకునే పొరపాటు చేయకూడదని చాణక్యుడు చెప్పాడు. ఎందుకంటే వారిద్దరూ ఆ విషయంలో నిపుణులు. అలాంటి సందర్భంలో మనం జోక్యం చేసుకుంటే మనం అవమానించబడవచ్చు. ఎందుకంటే మనకు ఆ విషయం గురించి తగినంత జ్ఞానం లేకపోయినా.. మనం జోక్యం చేసుకుంటే అవమానమే జరుగుతుంది. అలాంటి సందర్భంలో వారి మధ్యలో జోక్యం చేసుకోకపోవడమే మనకు మంచిదని చెప్పారు.

గొడవలు, తగాదాలు

ఇద్దరు వ్యక్తులు పోట్లాడుకుంటున్నప్పుడు.. మీరు పోరాటం మధ్యలోకి రాకూడదని చాణక్యుడు స్పష్టం చేశారు. ఎందుకంటే చాలా సందర్బాల్లో అది మీకు హాని కలిగించవచ్చు. వారి మధ్యలో జోక్యం చేసుకోవడం ద్వారా మీరు మరో శత్రువును కూడా పెంచుకున్నవారు అవుతారని చాణక్యుడు తెలిపారు.

NOte: ఈ వార్తలోని సమాచారం అందుబాటులో ఉన్న వనరుల నుంచి సేకరించి పాఠకుల కోసం అందించడం జరిగింది. దీనిని TV9 తెలుగు ధృవీకరించదు.