Khieu Samphan: కంబోడియాలో మైనారిటీలపై జరిగిన మరణంపై 47 ఏళ్ల తర్వాత హంతుకుడి నేరాలపై కోర్టు తీర్పు వెలువరించింది. దేశంలోని మైనార్టీలైన చామ్ ముస్లింలు, వియత్నామీస్‌పై జరిగిన మారణహోమంలో ప్రధాన నిందితుడు ఖియు సంఫాన్‌ను తొలగించాలని చేసిన విజ్ఞప్తిని తిరస్కరించింది. ఖియు సంఫాన్ పాలనలో రెండు మిలియన్ల బాధితులున్నారు. వారిలో 100,000 నుండి 500,000 మంది చామ్ ముస్లింలు, 20,000 మంది వియత్నామీస్ జాతికి చెందినవారు. ఇప్పుడు సుమారు 47 సంవత్సరాల తర్వాత హంతకుడు చేసిన నేరాలు కూడా లెక్కించబడ్డాయి. 91 ఏళ్ల వృద్ధుడు మారణహోమానికి పాల్పడినట్లు కోర్టు నిర్ధారించింది. అతని వయస్సు ను దృష్టిలో ఉంచుకుని జీవితాంతం కటకటాల వెనుక జీవించాలని కోర్టు ఆదేశించింది.
కంబోడియాలో మిగిలిన చివరి ఖైమర్ రూజ్ నాయకుడు ఖియు సంఫాన్.. పాలనలో నగరం శ్మశానవాటికగా మారింది. ఇక జీవించి ఉన్నవారు కూడా చాలా చిత్రహింసలు ఎదుర్కోవలసి వచ్చింది. ఎంతగా అంటే.. తమను చంపేయమని అధికారులను వేడుకునేవారు. కేవలం మూడు సంవత్సరాల ఖైమర్ రూజ్ పాలనలో.. కంబోడియా జనాభాలో 25 శాతం మంది మరణించారు. అత్యంత కౄరంగా హత్య చేశారు.
కంబోడియాలోని UN-మద్దతుగల ట్రిబ్యునల్ కోర్ట్ ఆఫ్ కంబోడియా (ECCC) ఖైమర్ రూజ్ పాలనలో జీవించి ఉన్న చివరి నాయకుడు మారణహోమానికి పాల్పడినట్లు నిర్ధారించింది. అతడికి విధించిన జీవిత ఖైదు శిక్షను సమర్థించింది. కమ్యూనిస్ట్ నాయకుడు పాల్ పాట్ నేతృత్వంలోని పాలనను కంబోడియా దేశంలో అత్యంత క్రూరమైన పాలనగా చరిత్రకారులు చెబుతున్నారు. వీరి పాలనలో జీవించి ఉన్న చివరి నాయకుడు సంఫన్‌కు ఇప్పుడు 91 సంవత్సరాలు. అతను కంబోడియా అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు. అతను తన శిక్షపై అప్పీల్ చేసాడు. తనను తాను నిర్దోషిగా ప్రకటించుకున్నాడు. 2018లో అతను మానవత్వాన్ని మంటగలిపేలా అనేక నేరాలకు పాల్పడినట్లు నిర్ధారించారు.
ఊచకోత, ఆకలి, హింస:
ఏప్రిల్ 17, 1975 నుండి జనవరి 7, 1979 వరకు అంటే 3 సంవత్సరాల 8 నెలల 20 రోజుల పాలన మాత్రమే చేశాడు ఖియు సంఫాన్ . కానీ ఈ 3 సంవత్సరాల ఖైమర్ రూజ్ పాలనలో కంబోడియా దేశంలో రక్త నదులు ప్రవహించాయి. చైనా కమ్యూనిస్ట్ నాయకుల ప్రభావంతో, ప్రధాన మంత్రి పోట్ పోల్ ముస్లింలు, ఇతర తెగల ప్రజలు, బౌద్ధులతో సహా మిలియన్ల మంది ప్రజలను లక్ష్యంగా చేసుకుని మరణం హోమం సృష్టించాడు. మైనార్టీల జనాభాను తగ్గించడానికి నరమేథం సృష్టించాడు. అంతేకాదు జీవించి ఉన్నవారిని చిత్ర హింసలకు గురి చేశాడు. ఆకలితో అలమటిస్తూ, వేదనతో అనేక మంది బలవన్మరణానికి పాల్పడ్డారు.
మారణహోమం:
ఖైమర్ రూజ్ హయాంలో భారీ ఎత్తున ప్రజలు ఊచకోతకు గురయ్యారు. బుల్లెట్లు ఖరీదైంది కనుక గొడ్డలితో నరికివేశారు. క్రూరత్వం హద్దులు దాటి పిల్లలను కూడా హత్యగావించారు. ‘మీరు గడ్డిని నాశనం చేయాలనుకుంటే, దానిని వేరు నుండి తుడిచివేయండి అనేది ఖియు సంఫాన్ నినాదం. దీంతో కుటుంబం మొత్తం నాశనం చేసేవారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..