California Storm: కన్నీరు పెడుతోన్న కాలిఫోర్నియా.. భారీ వర్షాలు కురిసే అవకాశం.. నగరం ఖాళీ చేయాలని హెచ్చరికలు

|

Jan 11, 2023 | 7:20 AM

ఇప్పటికే కష్టాల్లో ఉన్న జనానికి వాతావరణ శాఖ పిడుగు లాంటి వార్త చెప్పింది. వచ్చే 24 గంటల్లో ఈ ప్రాంతంలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నది దాని సమాచారం. రోజుల తరబడి వర్షాలు కురుస్తుండటంతో బురదచరియలు విరిగిపడే ప్రమాదముందని తెలిపారు.

California Storm: కన్నీరు పెడుతోన్న కాలిఫోర్నియా.. భారీ వర్షాలు కురిసే అవకాశం.. నగరం ఖాళీ చేయాలని హెచ్చరికలు
California Storm
Follow us on

కాలిఫోర్నియా, లాస్‌ ఏంజిల్స్‌లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కాలిఫోర్నియాలో దాదాపు 90 శాతం మంది ప్రజలు వరద గుప్పిట్లో చిక్కుకున్నారు. భారీ వర్షాల కారణంగా ముంచెత్తిన వరదలతో పలు చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. మరికొన్ని చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. వర్షాల నేపథ్యంలో కాలిఫోర్నియా రాష్ట్రంలో సుమారు 25 వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

మాంటెసిటోలోనూ పరిస్థితి తీవ్రంగా ఉంది. ఇప్పటికే కష్టాల్లో ఉన్న జనానికి వాతావరణ శాఖ పిడుగు లాంటి వార్త చెప్పింది. వచ్చే 24 గంటల్లో ఈ ప్రాంతంలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నది దాని సమాచారం. రోజుల తరబడి వర్షాలు కురుస్తుండటంతో బురదచరియలు విరిగిపడే ప్రమాదముందని తెలిపారు. ఇప్పటికే నగరంలోని చాలా ప్రాంతాల్లో వరదనీరు చేరింది. లోతట్టు ప్రాంతాల్లో బురద ప్రవాహం పెరిగింది.

లాస్‌ఏంజిల్స్‌కు సమీపంలో ఉండే మాంటెసిటో నగరానికి బురద చరియల ముప్పు పొంచి ఉంది. దీంతో ఈ నగరాన్ని ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. ఏ నగరంలోనే అనేక మంది హాలీవుడ్‌ ప్రముఖులకు నివాసం. బ్రిటన్‌ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్‌ హ్యారీ, మేఘన్‌ మెర్కెల్‌ దంపతులు, ప్రముఖ వ్యాఖ్యాత ఓప్రా విన్ఫ్రే, ప్రముఖ నటులు జెన్నిఫర్‌ అనిస్టన్‌, ల్యారీ డేవిడ్‌తో పాటు అమెరికా వినోద రంగానికి చెందిన అనేక మంది ఇక్కడ నివాసముంటున్నారు. అయితే వీరిలో ఎంతమంది నగరం వీడి వెళ్లారనే దానిపై స్పష్టత లేదు. తాజా అంచనాల నేపథ్యంలో నగరాన్ని సైరన్లు మోగుతున్నాయి. నగరాన్ని ఖాళీ చేయాలంటూ పదే పదే హెచ్చరికలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

కాలిఫోర్నియాలో 17 రీజియన్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో పలు జిల్లాల్లో స్కూళ్లు, ఆఫీసులకు సెలవులు ప్రకటించారు. శాక్రమెంటో ఏరియాలో భారీ వృక్షాలు కూలి విద్యుత్ తీగలపై పడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..