Bharat Biotech’s Covaxin: భారత్ బయోటెక్.. కోవాక్సిన్‌ను నిరాకరించిన బ్రెజిల్.. ఎందుకంటే..?

|

Apr 01, 2021 | 2:59 AM

Brazilian health regulator: భారత్‌ బయోటెక్‌ సంస్థ అభివృద్ధి చేసిన కోవాక్సిన్ టీకాపై బ్రెజిల్ పలు ఆరోపణలు చేసింది. కోవాక్సిన్ ఉత్పత్తిలో భారత్ బయోటెక్ నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని బ్రెజిల్‌ ఆరోగ్య నియంత్రణ సంస్థ

Bharat Biotechs Covaxin: భారత్ బయోటెక్.. కోవాక్సిన్‌ను నిరాకరించిన బ్రెజిల్.. ఎందుకంటే..?
Bharat Biotech's Covaxin
Follow us on

Brazilian health regulator: భారత్‌ బయోటెక్‌ సంస్థ అభివృద్ధి చేసిన కోవాక్సిన్ టీకాపై బ్రెజిల్ పలు ఆరోపణలు చేసింది. కోవాక్సిన్ ఉత్పత్తిలో భారత్ బయోటెక్ నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని బ్రెజిల్‌ ఆరోగ్య నియంత్రణ సంస్థ ‘అన్విసా’ పేర్కొంది. ఈ మేరకు తమ దేశంలోకి కోవాక్సిన్ దిగుమతిని తిరస్కరిస్తున్నట్లు వెల్లడించింది. బ్రెజిల్‌కు 2 కోట్ల డోసుల కోవాక్సిన్‌ సరఫరాకు ఇటీవల భారత్‌ బయోటెక్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు బ్రెజిల్‌ ఆరోగ్య నియంత్రణ సంస్థకు చెందిన ఐదుగురు అధికారుల బృందం మార్చి మొదటి వారంలో హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌ ప్లాంటును సైతం సందర్శించింది.

ఈ క్రమంలోనే బ్రెజిల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఔషధాలు, టీకాలు నాణ్యతలో తేడా రాకుండా అందరిలో ఒకేలా పనిచేయాలంటే మంచి ఉత్పత్తి జరగాలని సూచింది. శుభ్రత, నియమాలు, నాణ్యత, భద్రతా ప్రమాణాలు పాటించాలని పేర్కొంది. భారత్‌ బయోటెక్‌ ప్లాంటులో ఆ విధానాలను పాటించడం లేదని.. కొన్ని కీలక పత్రాలు సమర్పించలేదని, కంటెయినర్స్‌ ఇంటెగ్రిటీని పాటించడంలేదని తెలిపింది. దీంతోపాటు స్టెరిలైజింగ్‌, డిస్‌ఇన్ఫెక్టింగ్‌, వైర్‌స్‌ తొలగింపు, అరికట్టడం లాంటి పద్ధతుల విషయంలో కూడా ఉత్తమ విధానాలను పాటించట్లేదని బ్రెజిల్ అన్విసా బృందం నివేదించింది.

కావున బ్రెజిల్‌లోకి కోవాక్సిన్ దిగుమతిని తిరస్కరిస్తున్నట్టు బ్రెజిల్‌ ఆరోగ్య నియంత్రణ సంస్థ అన్విసా ప్రకటించింది. కాగా.. అన్విసా అధికారులు కోరిన అంశాలను నెరవేరుస్తామని, అది ఎప్పటిలోగా అనే విషయంపై బ్రెజిల్‌ జాతీయ ఆరోగ్య నియంత్రణ సంస్థతో చర్చిస్తున్నామని భారత్ బయోటెక్ వెల్లడించింది. త్వరలోనే దీనిని పరిష్కరిస్తామని పేర్కొంది. ఇప్పటివరకు కోవాక్సిన్ అత్యవసర వినియోగానికి 40కి పైగా దేశాలకు విజ్ఞప్తి చేశామని.. కొన్ని దేశాలు అనుమతి ఇచ్చాయని భారత్ బయోటెక్ వెల్లడించింది.

Also Read:

COVID-19 vaccine: పిల్లలకూ రెడీ అవుతున్న కరోనా వ్యాక్సిన్.. ఫైజర్ టీకా ట్రయల్స్‌ విజయవంతం

Covid-19: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కరోనా కలకలం.. 30 మందికి పాజిటివ్‌