Minister Resigns: కరోనా వ్యాక్సిన్ కొరత.. సర్వత్రా విమర్శలు.. పదవికి రాజీనామా చేసిన మంత్రి…

Minister Resigns: ఓవైపు కరోనా వైరస్ విజృంభిస్తోంది.. మరోవైపు కరోనా వ్యాక్సిన్ కొరత.. వెరసి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు...

Minister Resigns: కరోనా వ్యాక్సిన్ కొరత.. సర్వత్రా విమర్శలు.. పదవికి రాజీనామా చేసిన మంత్రి...
Brazilian Foreign Minister

Updated on: Mar 30, 2021 | 7:24 AM

Minister Resigns: ఓవైపు కరోనా వైరస్ విజృంభిస్తోంది.. మరోవైపు కరోనా వ్యాక్సిన్ కొరత.. వెరసి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లుతున్నాయి. వ్యాక్సిన్‌ కొరతకు దౌత్యపరమైన వైఫల్యమే కారణమంటూ విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. చివరికి వ్యాక్సిన్ కొరతకు నైతిక బాధ్యత వహిస్తూ బ్రెజిల్ విదేశాంగ మంత్రి ఎర్నెస్టో అరౌజో తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని బ్రెజిల్ మీడియా వెల్లడించింది. తన వల్ల ప్రభుత్వానికి సమస్యలు ఎదురవ్వొద్దనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎర్నెస్టో ప్రకటించారు. తన రాజీనామా లేఖను బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో కి పంపించారు. అయితే, దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

బ్రెజిల్‌లో కరోనా సంక్షోభం మరింతగా ముదురుతోంది. రోజు రోజుకు పరిస్థితి దారుణంగా తయారవుతోంది. ఓవైపు కరోనా కేసులు, మరణాలు భారీగా పెరుగుతుంటే.. మరోవైపు కరోనా వ్యాక్సిన్ కొరత ఆ దేశాన్ని కుదిపేస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల పార్లమెంట్‌లో విపక్షాలు ప్రభుత్వాన్ని ఏకిపారేశాయి. విదేశాంగ మంత్రి ఎర్నెస్టో అరౌజో తీసుకునే దౌత్యపరమైన నిర్ణయాల వల్లే వ్యాక్సిన్ కొరత ఏర్పడిందంటూ విమర్శలు గుప్పించారు. బ్రెజిల్‌కు వ్యాక్సిన్ దిగుమతి చేసుకునే విషయంలో వైఫల్యం చెందారంటూ ఆరోపించారు. వ్యాక్సిన్ కొరత అంశం మరింత వివాదం అవడంతో.. ప్రస్తుత పరిస్థితికి నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఎర్నెస్టో తన ప్రకటించారు. కాగా, మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఎర్నోస్టోకి బలమైన సంబంధాలు ఉన్నాయి. ఇదే సమయంలో ఆయన చైనా పట్ల కఠిన వైఖరిని అవలంబించేవారు. ఇలాంటి వైఖరుల వల్లే.. బ్రెజిల్ కరోనా టీకా పొందడంలో వైఫల్యం చెందిందని విపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నారు.

ఇదిలాఉంటే.. కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి బ్రెజిల్‌‌లో తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోతోంది. బ్రెజిల్‌లో తాజాగా ఒక్క రోజులు 3,650 కరోనా మరణాలు సంభవించగా.. 1,00,158 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు, మరణాల విషయంలో అమెరికా తరువాత రెండోస్థానంలో బ్రెజిల్ ఉంది. ఈ దేశంలో ఇప్పటి వరకు మొత్తం 12.5 మిలియన్లకు పైగా జనాలు కరోనా వైరస్ బారిన పడగా.. 3,12,000 మందికి పైగా కరోనా సోకి ప్రాణాలు కోల్పోయారు.

Also read:

Horoscope Today: ఈరోజు ఈ రాశివారి ఉద్యోగ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.. అందుకు ఏం చేయాలంటే..

Indonesia Fire Accident: ఇండోనేషియాలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగుకి గాయాలు.. వెయ్యిమందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలింపు