Brain-Eating Amoeba: చాప కింద నీరులా వ్యాపిస్తోన్న ‘మెదడు తినే అమీబా’.. ఇప్పటి వరకూ 11 మంది బలి

|

Nov 06, 2023 | 4:26 PM

పాకిస్తాన్‌ మరో సమస్యలో చిక్కుకుంది. మెదడు తినే అమీబా అక్కడి జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. పాక్‌లోని పలు రాష్ట్రాల్లో ‘మెదడును తినే అమీబా’ బారిన పడి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ‘నేగ్లేరియా ఫొలెరి ( Naegleria fowleri)’ అనే ఏక కణ జీవి ఈ మారణహోమాలకు కారణం అని ఇప్పటికే వైద్యులు దృవీకరించారు. తాజాగా కరీచీలో దీని భారీన పడి మరో ప్రాణం గాలిలో కలిసిపోయింది. దీంతో ఇప్పటి వరకు ‘మెదడును తినే అమీబా’ బారీన పడి 11 మంది మృతి చెందినట్లు సింధ్‌..

Brain-Eating Amoeba: చాప కింద నీరులా వ్యాపిస్తోన్న మెదడు తినే అమీబా.. ఇప్పటి వరకూ 11 మంది బలి
Brain Eating Amoeba
Follow us on

కరాచీ, నవంబర్‌ 6: పాకిస్తాన్‌ మరో సమస్యలో చిక్కుకుంది. మెదడు తినే అమీబా అక్కడి జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. పాక్‌లోని పలు రాష్ట్రాల్లో ‘మెదడును తినే అమీబా’ బారిన పడి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ‘నేగ్లేరియా ఫొలెరి ( Naegleria fowleri)’ అనే ఏక కణ జీవి ఈ మారణహోమాలకు కారణం అని ఇప్పటికే వైద్యులు దృవీకరించారు. తాజాగా కరీచీలో దీని భారీన పడి మరో ప్రాణం గాలిలో కలిసిపోయింది. దీంతో ఇప్పటి వరకు ‘మెదడును తినే అమీబా’ బారీన పడి 11 మంది మృతి చెందినట్లు సింధ్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ వెల్లడించింది.

పాకిస్థాన్‌ ఆరోగ్య శాఖ నివేదికల ప్రకారం.. కరీచీలోని బఫెర్‌జోన్‌కు చెందిన మరొక స్థానికుడు ‘నేగ్లేరియా ఫొలెరి’ ఇనెఫెక్షన్‌ కారణంగా మృతి చెందినట్లు వెల్లడించింది. బాధితుడిలో గత మూడు రోజులుగా తీవ్ర జ్వరం, తలనొప్పి లక్షణాలు కనిపించినట్లు సింధ్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ సంబంధించిన ఓ అధికారి తెలిపారు. తాజాగా మరణించిన వ్యక్తిని అద్నాన్ అనే 45 ఏళ్ల వ్యక్తిగా గుర్తించారు. అతను అక్టోబరు 23న కరాచీలో మృతి చెందినట్లు తెలిపారు. గడచిన రెండు వారాల్లో కరాచీలోని సెంట్రల్‌ జిల్లాలో ‘నేగ్లేరియా ఫొలెరి’ ఇనెఫెక్షన్‌ సోకి ముగ్గురు మరణించినట్లు తెల్పింది.

మెదడును తినే అమీబా ‘నేగ్లేరియా ఫౌలెరి’ కరాచీలో మరొకరిని బలిగొందని సింధ్ ఆరోగ్య శాఖ తెలియజేనట్లు అక్కడి స్థానిక మీడియ పేర్కొంది. సింధ్ తాత్కాలిక ఆరోగ్య మంత్రి డాక్టర్‌ సాద్‌ ఖలీద్‌ మాట్లాడుతూ.. ‘మెదడును తినే అమీబా’ మంచినీటి వనరుల్లో వృద్ధి చెందే అరుదైన ప్రాణి. కానీ ఇది ప్రాణాంతకమైనది. నీళ్ల ద్వారా సంక్రమించే ‘మెదడును తినే అమీబా’ బారిన పడకుండా నివారణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. తగినంత క్లోరినేషన్ చేయని చెరువులు, స్విమ్మింగ్ ఫూల్స్‌లలో ఈత కొట్టడం మానుకోవాలని, ముక్కులోకి నీరు చేరడానికి దారితీసే కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఈ మేరకు సింధ్ కేర్ టేకర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంత్రి కరాచీ ప్రజలకు సూచనలు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి

అసలీ బ్రెయిన్ ఈటింగ్ ‍అమీబా ఎక్కడి నుంచి వచ్చింది..

బ్రెయిన్ ఈటింగ్ ‍అమీబాకు సంబంధించిన ఆనవాళ్లు 1937లో అమెరికాలో తొలిసారిగా వెలుగుచూసింది. ఈ అమీబా నీరు నిల్వ ఉండే కొలనులు, నదులు, కాలువలు, చెరువల్లో ఉంటుంది. ముక్కు, నోరు, చెవి ద్వారా మనిషి శరీరం లోపలికి ప్రవేశించి మనిషి మెదడును తినేస్తుంది. ఫలితంగా మరణం సంభవిస్తుంది. అయితే ఇది ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశం తక్కువని, బ్రెయిన్ ఈటింగ్ అమీబా కేసులు అత్యంత అరుదుగా మాత్రమే నమోదవుతాని తెల్పింది. 2018 నుంచి అమెరికా, భారత్, చైనా ఇప్పటి వరకు 381 మంది ఈ వ్యాధి బారినపడినట్లు తెలుస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.