Parliament Bomb Blast: టర్కీలోని పార్లమెంట్ హౌస్ దగ్గర బాంబు పేలుడు

ఇద్దరు ఉగ్రవాదుల్లో ఒకరు బాంబుతో పేల్చేసుకున్నారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభానికి ముందు టర్కీలో దాడి జరిగింది. ఇందులో ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. స్థానిక మీడియా సమాచారం మేరకు బాంబ్ స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుకుంది. ఘటనా స్థలంలో జరిగిన దాడిపై దర్యాప్తు చేస్తున్నారు. ఉగ్రవాదుల దాడి తర్వాత పార్లమెంట్‌ పరిసరాల్లో భద్రతను పెంచారు. టర్కీ రాజధాని అంకారాలో జరిగిన దాడిలో ఇద్దరు పోలీసు అధికారులు.

Parliament Bomb Blast: టర్కీలోని పార్లమెంట్ హౌస్ దగ్గర బాంబు పేలుడు
Turkey

Updated on: Oct 01, 2023 | 4:41 PM

ఈరోజు ఆదివారం టర్కీ రాజధాని అంకారాలో బాంబు పేలుడు సంభవించింది. పార్లమెంటు సమీపంలో పేలుడు సంభవించింది. టర్కీ పార్లమెంట్ కొత్త సమావేశాలు ప్రారంభానికి ముందు రాజధానిలో జరిగిన దాడిని ఉగ్రవాద దాడిగా టర్కీ అంతర్గత మంత్రిత్వ శాఖ అభివర్ణించింది. హోం మంత్రిత్వ శాఖ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ ప్రవేశ ద్వారం ముందు ఉదయం 9:30 గంటలకు ఆర్మీ వాహనంలో ఇద్దరు ఉగ్రవాదులు వచ్చి బాంబు పేల్చారని మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఓ ఉగ్రవాది బాంబుతో తనను తాను పేల్చేసుకున్నాడు

ఇవి కూడా చదవండి

ఇద్దరు ఉగ్రవాదుల్లో ఒకరు బాంబుతో పేల్చేసుకున్నారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభానికి ముందు టర్కీలో దాడి జరిగింది. ఇందులో ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. స్థానిక మీడియా సమాచారం మేరకు బాంబ్ స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుకుంది. ఘటనా స్థలంలో జరిగిన దాడిపై దర్యాప్తు చేస్తున్నారు. ఉగ్రవాదుల దాడి తర్వాత పార్లమెంట్‌ పరిసరాల్లో భద్రతను పెంచారు.

 


ఈ దాడిలో ఇద్దరు పోలీసు అధికారులు గాయపడ్డారు:

టర్కీ రాజధాని అంకారాలో జరిగిన దాడిలో ఇద్దరు పోలీసు అధికారులు గాయపడ్డారని మంత్రి అలీ యెర్లికాయ తెలిపారు. పార్లమెంటు తిరిగి ప్రారంభమయ్యే ముందు రోజు ఉగ్రదాడి జరిగింది.

 


పోలీసులు జరిపిన కాల్పుల్లో మరో ఉగ్రవాది హతమయ్యాడు:
స్థానిక పోలీసులు కూడా ఆ ప్రాంతంలో తనిఖీలు చేస్తున్నారు. ఘటనా స్థలానికి వైద్య బృందాన్ని కూడా పంపించారు. ఆదివారం నాడు తన మంత్రిత్వ శాఖ సమీపంలో ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చుకున్నాడని, పోలీసులతో జరిగిన కాల్పుల్లో మరో ఉగ్రవాది హతమయ్యాడని టర్కీ మంత్రి తెలిపారు.

 

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి