ఇటీవల అజర్‌బైజన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమాన ప్రమాదం మరువకముందే మరో దారుణం చోటుచేసుకుంది. దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 181 మందితో ప్రయాణిస్తున్న బోయింగ్ 737-800 విమానం మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 62 మంది మరణించారు. అయితే ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 6 మంది సిబ్బంది, 175 మంది ప్రయాణికులు ఉన్నారు. యోన్‌హాప్ న్యూస్ ఏజెన్సీ నివేదిక ప్రకారం, ల్యాండింగ్ సమయంలో, విమానం రన్‌వే నుండి జారిపడి సరిహద్దు గోడను ఢీకొట్టింది.
ప్రహారీ గోడను ఢీకొట్టడంతో విమానం మంటల్లో చిక్కుకుంది. దీంతో విమానాశ్రయంలో గందరగోళం నెలకొంది. వెంటనే స్పందించిన సిబ్బంది మువాన్ విమానాశ్రయంలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. విమానంలో మంటలు చెలరేగడంతో ఆకాశం అంతా పొగతో నిండిపోయింది. ఈ విమాన ప్రమాదంపై దక్షిణ కొరియా తాత్కాలిక అధ్యక్షుడు చోయ్ సాంగ్ మూ విచారం వ్యక్తం చేశారు. మువాన్ విమానాశ్రయంలో తక్షణ సహాయక చర్యలకు ఆయన ఆదేశించారు. కాగా, మునుపటి తాత్కాలిక అధ్యక్షుడు హన్ దుక్-సూ అభిశంసనకు గురైన తర్వాత శుక్రవారం(డిసెంబర్ 27) చోయ్ సాంగ్-మూను దేశ తాత్కాలిక నాయకుడిగా నియమించారు.
మువాన్ విమానాశ్రయంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు సజీవంగా ఉన్నట్లు గుర్తించారు. జెజు ఎయిర్ ఫ్లైట్ నంబర్ 2216 బ్యాంకాక్ నుండి దక్షిణ కొరియాకు తిరిగి వస్తోంది. విమానంలో మంటలు చెలరేగడంతో ఆకాశం అంతా పొగతో నిండిపోయింది. రెస్క్యూ టీమ్ విమానం వెనుక భాగం నుంచి ప్రయాణికులను బయటకు తీశారు. ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ గేర్‌లో సమస్య తలెత్తడంతో ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
వీడియో చూడండి..
#BREAKING An Image from the Crash Site of Jeju Air Flight 2216 at Muan International Airport in South Korea, showing the Tail of the Aircraft engulfed in Flame@fastnewsnet pic.twitter.com/PBNOEyx0DW
— Abdul khabir jamily (@JamilKhabir396) December 29, 2024
ఇటీవల అజర్‌బైజన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన J28243 విమానం కుప్పకూలడంతో 38 మంది మరణించారు. బాకు నగరం నుంచి రష్యాలోని చెచెన్ ప్రాంతానికి ప్రయాణిస్తున్న విమానం కజకిస్థాన్‌లో కూలిపోయింది. పక్షి ఢీకొనడం వల్ల పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తుండగా ప్రమాదం జరిగిందని రష్యా ఏవియేషన్ పేర్కొంది. ఇది వేగంగా కిందికి దూసుకొచ్చి నేలను ఢీకొని ముక్కలుగా విరిగిపోయింది. విమానం కూలిపోయిన సమయంలో ఐదుగురు క్రూతో పాటు మొత్తం 69 మంది ఉన్నారు.
దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ముయాన్ విమానాశ్రయంలో రన్‌వేపై విమానం అదుపుతప్పి ప్రహారీ గోడను ఢీకొని మంటలు అంటుకున్నాయి. ప్రమాద సమయంలో విమానంలో 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనలో 28 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. బ్యాంకాక్ నుంచి ముయూన్‌కు వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..