Boat Accident: ఘోర పడవ ప్రమాదం.. 23 మంది మృతి.. పలువురు గల్లంతు..

|

Sep 25, 2022 | 5:30 PM

Boat Accident: అప్పుడప్పుడు పడవ ప్రమాదాలు ప్రాణాల మీదకు వస్తుంటుంది. సముద్రంలో పడవ ప్రమాదాల కారణంగా ఎంతో మంది మృత్యువాత పడుతుంటారు. తాజాగా..

Boat Accident: ఘోర పడవ ప్రమాదం.. 23 మంది మృతి.. పలువురు గల్లంతు..
Boat Accident
Follow us on

Boat Accident: అప్పుడప్పుడు పడవ ప్రమాదాలు ప్రాణాల మీదకు వస్తుంటుంది. సముద్రంలో పడవ ప్రమాదాల కారణంగా ఎంతో మంది మృత్యువాత పడుతుంటారు. తాజాగా జరిగిన ఓ పడవ ప్రమాదంలో చాలా మంది మృతి చెందారు. ఆదివారం బంగ్లాదేశ్‌లో ఘోర పడవ ప్రమాదం చోటు జరిగింది. కరటోయా నదిలో ఓ పడవ బోల్తా పడటంతో 23 మంది మృతి చెందగా, పలువురు గల్లంతు అయ్యారు. బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాకు 468 కిలోమీటర్ల దూరంలో ఉత్తర పంచాగఢ్‌ జిల్లాలోని కరటోయా నదిలో ఈ ప్రమాదం జరిగింది.

 

ఇవి కూడా చదవండి


అయితే ప్రమాద సమయంలో పడవలో 100 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అక్కడి పోలీసులు వెల్లడించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సహాయక బృందాలతో అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ప్రయాణికులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు బయటకు తీసిన మృతదేహాల్లో పిల్లలు, మహిళలు ఉన్నారని ఉత్తర పంచగఢ్‌ జిల్లా పాలనాధికారి జహురుల్‌ ఇస్లాం తెలిపారు. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. స్థానిక కాలమాన ప్రమాదం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రమాదం జరిగింది. బంగ్లాదేశ్‌లో జరిగే పడవ ప్రమాదాల్లో వందలాది మంది మరణిస్తున్నారు. ఈ ప్రాంతం లోతట్టు జల మార్గాలను కలిగి ఉంటుంది. ఇక్కడ భద్రతా ప్రమాణాలు తక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఇదే సంవత్సరంలో మే నెలలో స్పీడ్‌బోట్‌ పద్మనదిలో ఇసుకతో నిండిన బల్క్‌ క్వారియర్‌ను ఢీకొనడంతో 26 మంది మృతి చెందారు.