Bernie Sanders Doll Sale For: అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో సెనేటర్ బెర్నీ సాండర్స్ ప్రత్యేక ఆకర్షణ నిలిచిన విషయం తెలిసిందే. జర్కిన్, నోటికి మాస్కు, చేతులకు గ్లౌజ్‌లు ధరించి కాళుపై కాళు వేసుకొని కుర్చీలో కూర్చున్న బెర్నీ సాండర్స్ ఫొటో నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ తారల వరకు బెర్నీ సాండర్స్ మీమ్‌ను తెగ వైరల్‌గా మార్చారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు బెర్నీ సాండర్స్ మరోసారి వార్తల్లోకెక్కాడు. వివరాల్లోకి వెళితే అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన ఓ మహిళ బెర్నీ సాండర్స్ మీమ్‌ను పోలీన ఓ బొమ్మను రూపొందించింది. కేవలం బొమ్మను తయారు చేయడమే కాకుండా ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టేసింది. దీంతో ఆమె నిర్వహించిన ఆ ఆన్‌లైన్ వేలంలో పాల్గొన్న ఓ వ్యక్తి ఈ బొమ్మను ఏకంగా 20 వేల డాలర్లకు కొనుగోలు చేశారు. మన కరెన్సీలో చెప్పాలంటే అక్షరాల రూ.14 లక్షలకు పైమాటే. ఇక బెర్నీ సాండర్స్ క్రేజ్ ఇక్కడితో ఆగిపోలేదు.. టీషర్టులపై బొమ్మల రూపంలో కూడా దర్శనమిస్తున్నాయి.