Penguins Kills: తేనెటీల దాడిలో 63 అరుదైన పెంగ్విన్స్ మృతి చెందడం సంచలనంగా మారింది. మృతి చెందిన పెంగ్విన్స్‌ను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు అధికారులు. దక్షిణాఫ్రికాలోని కేఫ్ టౌన్ వెలుపల బీచ్‌లో అంతరించిపోతున్న 63 అరుదైన పెంగ్విన్స్ తేనెటీగల దాడిలో మరణించినట్లు దక్షిణ ఆఫ్‌రికన్ ఫౌండేషన్ తెలిపింది. సైమన్స్ టౌన్, కేఫ్ టౌన్ సమీపంలో ఉన్న ఒక చిన్నపట్టణంకు పోస్టమార్టం నిమిత్తం తీసుకెళ్లారు. ఈ పోస్టుమార్టంలో పెంగ్విన్స్ కళ్ల చుట్టు తేనెటీగలు కుట్టడం గుర్తించినట్లు ఫౌండేషన్ డేవిడ్ రాబర్ట్స్ అనే క్లినికల్ పశువైద్యుడు వెల్లడించారు. ఇలాంటి ఘటన జరగడం చాలా అరుదైనదిగా ఆయన పేర్కొన్నారు. అయితే ఘటన స్థలంలో చనిపోయిన తేనెటీగలు కూడా ఉన్నట్లు ఆఫ్రికల్ ఫౌండేషన్‌కు తెలియజేశాడు.
పెంగ్విన్స్ ఇప్పటికే అంతరించిపోతున్న నేపథ్యంలో ఇలాంటి ఘటనల ద్వారా కనుమరుగయ్యే అవకాశం ఉందని రాబర్ట్స్ పేర్కొన్నారు. అలాగే పరీక్షల కోసం చనిపోయిన పెంగ్విన్స్ నమూనాలను పంపినట్లు దక్షిణ ఆఫ్రికా జాతీయ ఉద్యానవన శాఖ తెలిపింది. అయితే పెంగ్విన్స్‌పై ఎలాంటి గాయాలు కాలేదని, తేనె టీగలు కుట్టినట్లు స్పష్టంగా కనిపించినట్లు వైద్యులు నిర్ధారించారు. దక్షిణ ఆఫ్రికా తీరం, దీవులలో నివసించే ఆఫ్రికన్ పెంగ్విన్స్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆప్ నేచర్ రెడ్ లిస్టులో ఉన్నాయి. ఇప్పుడు అవి అంతరించిపోయే ప్రమాదం ఉంది.