బంగ్లాదేశ్‌కు చెందిన ప్రముఖ ఇస్కాన్ నాయకులలో ఒకరైన చిన్మోయ్ కృష్ణ దాస్‌ను ఢాకా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై ఇస్కాన్ సంస్థ స్పందిస్తూ.. చిన్మయ్ దాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తమకు ఆందోళన కలిగించే వార్తలు వచ్చాయని తెలిపింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం వెంటనే చిన్మోయ్ కృష్ణ దాస్‌ను విడుదల చేయాలని విజ్ఞప్తి చేసింది. భక్తుల భద్రత కోసం శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తున్నామని పేర్కొంది.
“ప్రపంచంలో ఏ ఉగ్రవాదంతో ఇస్కాన్‌కు సంబంధం లేదని.. నిరాధారమైన ఆరోపణలు చేయడం దారుణం” అని ఇస్కాన్ సంస్థ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ప్రధాని మోడీ తక్షణమే స్పందించాలని.. ఈ ఘటనపై తగిన చర్య తీసుకోవాలని, బంగ్లాదేశ్ ప్రభుత్వంతో మాట్లాడాలని ఇస్కాన్ సంస్థ భారత ప్రభుత్వాన్ని కోరింది. ఇస్కాన్ సంస్థ శాంతియుత భక్తి ఉద్యమాన్ని మాత్రమే నడుతున్నట్లు భారత ప్రభుత్వం బంగ్లాదేశ్‌కు చెప్పాలని కోరింది.
అంతేకాదు సోషల్ మీడియాలో ప్రధాని మోదీని ఉద్దేశించి ఇస్కాన్ సంస్థ చేసిన పోస్ట్ ను విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, బంగ్లాదేశ్‌లోని భారత రాయబార కార్యాలయం, బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ట్యాగ్ చేశారు. బంగ్లాదేశ్ పోలీసులు సోమవారం ఢాకాలోని హజ్రత్ షాజలాల్ విమానాశ్రయంలో చిన్మయ్ కృష్ణ దాస్‌ను అరెస్టు చేశారు.
We have come across disturbing reports that Sri Chinmoy Krishna Das, one of the prominent leaders of ISKCON Bangladesh, has been detained by the Dhaka police.
It is outrageous to make baseless allegations that ISKCON has anything to do with terrorism anywhere in the world.…
— Iskcon,Inc. (@IskconInc) November 25, 2024
పోలీసుల సూచనల మేరకు చిన్మయ్ దాస్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ప్రతినిధి తెలిపారు. తదుపరి చర్యల నిమిత్తం చిన్మయ్ కృష్ణ దాస్‌ను సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు అప్పగించనున్నారు. అయితే చిన్మయ్ కృష్ణ దాస్ అరెస్ట్ చేయడంపై బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ దీనిని ఖండించింది. ఈ చర్యలతో ప్రపంచంలో బంగ్లాదేశ్ ప్రతిష్ట మసకబారుతుందని కౌన్సిల్ పేర్కొంది. దాస్ చిట్టగాంగ్ వెళ్లాల్సి వచ్చిందని సనాతని జాగరణ్ జోట్ చీఫ్ ఆర్గనైజర్ తెలిపారు.
అక్టోబర్ 30న చిన్మయ్ దాస్ సహా 19 మందిపై చిట్టగాంగ్‌లోని కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. హిందూ సమాజం ర్యాలీలో బంగ్లాదేశ్ జాతీయ జెండాను అవమానించారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. మరోవైపు చిన్మయ్ దాస్‌పై తీసుకున్న ఈ చర్యపై బంగ్లాదేశ్‌లోని హిందూ సమాజంలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. చిట్టగాంగ్‌లోని చెరగి పహాడ్ కూడలి వద్ద వందలాది మంది వీధుల్లోకి వచ్చారు. చిన్మయ్ కృష్ణ దాస్‌ను విడుదల చేయాలని ప్రజలు డిమాండ్ చేశారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..