బిగ్‌ బ్రేకింగ్‌: పాకిస్థాన్‌ ఆర్మీ ఆఫీసర్లు, పోలీసులు వెళ్తున్న రైలును హైజాక్‌ చేసిన తీవ్రవాదులు!

పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ లోని వేర్పాటువాద సంస్థ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) జఫర్ ఎక్స్ ప్రెస్ రైలును హైజాక్ చేసింది. 140 మంది పాకిస్తాన్ సైనికులు బందీలుగా ఉన్నారు. బీఎల్ఏ బలూచిస్తాన్ కు స్వయంప్రతిపత్తి కోరుతోంది. పిల్లలు, మహిళలను విడుదల చేశారు. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్ చేపట్టింది.

బిగ్‌ బ్రేకింగ్‌: పాకిస్థాన్‌ ఆర్మీ ఆఫీసర్లు, పోలీసులు వెళ్తున్న రైలును హైజాక్‌ చేసిన తీవ్రవాదులు!
Train Hijacks In Pakistan

Updated on: Mar 11, 2025 | 5:07 PM

పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని వేర్పాటువాదలు మంగళవారం ఓ ఎక్స్‌ప్రెస్‌ రైలును హైజాక్‌ చేశారు. 400 మంది ప్రయాణికులతో వెళ్తున్న రైలును కాల్పులు జరిపి హైజాక్ చేసినట్లు సమాచారం. క్వెట్టా నుంచి పెషావర్‌ వస్తున్న జఫ్ఫార్‌ ఎక్స్‌ప్రెస్‌ను బలూచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీ హైజాక్‌ చేసింది. ఈ హైజాక్‌లో 140 మంది పాక్‌ సైనికులను బందీలుగా పట్టుకున్నారు. అయితే రైలులో ఉన్న పిల్లలను, మహిళలను మాత్రం విడిచపెట్టారు. రైల్వే ట్రాక్‌ను పేల్చి వేసిన తరువాత ఈ హైజాకింగ్‌కు పాల్పడ్డారు. బలూచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీ తీవ్రవాదుల కాల్పుల్లో రైలు డ్రైవర్‌కు గాయాలయ్యాయి. అయితే పాకిస్తాన్‌ ఎయిర్‌ఫోర్స్‌ వెంటనే ఆపరేషన్‌ చేపట్టింది. వైమానిక దాడులు ఆపకపోతే బందీలను చంపేస్తామని బలూచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీ తీవ్రవాదులు హెచ్చరించారు.

బలూచిస్తాన్‌ ప్రాంతానికి స్వయంప్రతిపత్తి కోరుతున్న ఉగ్రవాద వేర్పాటువాద సంస్థ బలూచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీ, తాము బందీలుగా పట్టుకున్నది పాకిస్తాన్ సైనిక సిబ్బంది, ఇతర భద్రతా సంస్థల సభ్యులని వెల్లడించింది. “బందీలుగా ఉన్నవారిలో పాకిస్తాన్ సైన్యం, పోలీసులు, యాంటీ-టెర్రరిజం ఫోర్స్, ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ నుండి యాక్టివ్-డ్యూటీ సిబ్బంది ఉన్నట్లు సమాచారం. వీరందరూ సెలవుపై పంజాబ్‌కు వెళ్తున్న క్రమంలో ఈ హైజాక్‌ జరిగింది. అయితే ఈ ఘటనపై ప్రాంతీయ ప్రభుత్వం అత్యవసర చర్యలు విధించిందని, పరిస్థితిని ఎదుర్కోవడానికి అన్ని సంస్థలను అలెర్ట్‌ చేసినట్లు పాక్‌ ప్రభుత్వ ప్రతినిధి షాహిద్ రిండ్ తెలిపారు. సంఘటన జరిగిన ప్రదేశానికి మరిన్ని భద్రతా దళాలు చేరుకున్నాయని రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.