బాబా వంగా గురించి చాలా మందికి తెలుసు. బాబా వంగా బల్గేరియాకు చెందిన ప్రవక్త. ఆమె అసలు పేరు వాంజెలియా పాండేవా దిమిత్రోవ్. 1911లో జన్మించిన బాబా వంగా పన్నెండేళ్ల వయసులో దుమ్ము తుఫానులో శాశ్వతంగా చూపు కోల్పోయింది. అప్పటి నుంచి ఆమె భవిష్యత్తును చూడటం ప్రారంభించింది. 1966లో మరణించిన బాబా వంగా 51వ శతాబ్దం వరకు భూమిపై జరిగిన ప్రధాన సంఘటనల గురించి అంచనా వేశారు. యువరాణి డయానా మరణం నుంచి 9/11 దాడులు.. జపాన్ వరదలు, బ్రెగ్జిట్ వరకు, బాబా వంగా చెప్పిన అనేక విషయాలు నిజం అయ్యాయి.
ప్రతి సంవత్సరం మాదిరిగానే బాబా వంగా 2024 కోసం అంచనాలు వేశారు. ఇందులో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు మందులు కనుగొనడం, ప్రపంచ ఆర్థిక మాంద్యం, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఘోరమైన దాడి ఉన్నాయి. ఈ అంచనా ఎంతవరకు నిజమయ్యాయో తెలియదు కానీ.. రానున్న సంవత్సరం 2025 లో జరగబోయే కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా అంచనా వేశారు. వీటిల్లో కొన్ని అంచనాలు మరింత భయానకంగా ఉన్నాయి. దీనికి సంబంధించిన సమాచారం ఇదిగో.
2025 నుంచి ఈ ప్రపంచంలో విపత్తు సంఘటనలు ప్రారంభమవుతాయని.. ఇవి మానవాళి పతనానికి దారితీస్తుందని బాబా వంగా ప్రవచించారు. ఈ విధ్వంసం వచ్చే ఏడాది (2025) ఐరోపాలో సంఘర్షణతో ప్రారంభమవుతుంది..ఇలా మొత్తం మానవ జాతి నాశనానికి పునాది పడి.. 5079 లో ప్రపంచంలో మానవాళి సంచారం పూర్తిగా ముగుస్తుంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..