Social Media: ఇతనేం డాక్టర్ సామీ.. ఆపరేషన్‌ మధ్యలోనే వదిలేసి జంప్.. ఆ తరువాత ఏం చేశాడో తెలిస్తే షాక్..!

|

Dec 02, 2021 | 5:20 AM

Social Media: ప్రస్తుత కాలంలో జనాలు సోషల్‌మీడియా మాధ్యమాలకు బానిసలుగా మారిపోతున్నారు. రాను రాను అది వ్యసనంగా మారి జీవితాలనే నాశనం చేసుకుంటున్నారు.

Social Media: ఇతనేం డాక్టర్ సామీ.. ఆపరేషన్‌ మధ్యలోనే వదిలేసి జంప్.. ఆ తరువాత ఏం చేశాడో తెలిస్తే షాక్..!
Doctor
Follow us on

Social Media: ప్రస్తుత కాలంలో జనాలు సోషల్‌మీడియా మాధ్యమాలకు బానిసలుగా మారిపోతున్నారు. రాను రాను అది వ్యసనంగా మారి జీవితాలనే నాశనం చేసుకుంటున్నారు. ఏదో ఒక రకంగా సోషల్‌ మీడియాలో పాపులర్‌ అవ్వాలనే ఉద్దేశంతో రకరకాల వీడియోలు చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటారు. ఇప్పడు మనం చెప్పుకోబోయే ఒక డాక్టర్‌ కూడా సామాజిక మాధ్యమాలకు బానిసై తన చక్కటి కెరియర్‌ను చేజేతులా పాడు చేసుకున్నాడు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

ఆస్ట్రేలియాకు చెందిన ఒక ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ టిక్‌టాక్‌కు బాగా అలవాటు పడ్డాడు. ఈ వ్యసనం అతని కెరియర్‌నే దెబ్బతీసింది. ఇతనికి టిక్‌టాక్‌లో 13 మిలియన్లకు పైగా ఫాలోవర్స్‌ ఉన్నారంటే అతనికి ఎంత టిక్‌టాక్‌ పిచ్చి ఉందో తెలుస్తోంది. అయితే అతను ప్లాస్టిక్‌ సర్జరీకి సంబంధించిన ఆపరేషన్‌లు అన్నింటిని టిక్‌టాక్‌లో పోస్ట్‌ చేసేవాడు. అంతేకాదు ఈ పిచ్చితో ఆపరేషన్లు కూడా పూర్తిగా చేయకుండా మధ్యలోనే వదిలేసేవాడు. దీంతో పలువురు ఇతనిపై ఫిర్యాదులు కూడా చేశారు. పైగా ఇతని వికృత వ్యసనం ఎంతకు దారితీసింది అంటే రోగుల ఆరోగ్యంతో ఆడుకునేవాడని బాధితులు వాపోయారు. అతను శస్త్ర చికిత్సను మధ్యలోనే ఆపేస్తాడని, ఒకటి చేయబోయి మరోకటి చేస్తాడంటూ పలువురు బాధితులు ఆస్ట్రేలియన్ హెల్త్ ప్రాక్టీషనర్ రెగ్యులేషన్ ఏజెన్సీ కి ఫిర్యాదులు చేశారు. దాంతో అతను ఇకపై ఎలాంటి శస్త్రచికిత్సలు చేయకుండా AHPRA అతనిపై నిషేధం విధించింది. అందుకే అంటారు.. అతి ఎప్పటికైనా ప్రమాదమే అని. ఈ డాక్టర్ విషయంలో ఇది మరోసారి నిరూపితమైంది.

Also read:

Omicron Spread: వేగంగా వ్యాపిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్..మరో రెండు దేశాల్లో కలకలం..ఒమిక్రాన్ లేటెస్ట్‌ అప్‌డేట్స్

Afghanistan Crisis: ఆఫ్ఘనిస్తాన్ ఆకలితో పాకిస్తాన్ వ్యాపారం.. భారత్ చేస్తున్న సహాయాన్ని తనదిగా చెప్పుకునే ప్రయాస!

Social Media: సోషల్ మీడియాలో మీ ఎకౌంట్ తీసేయాలని అనుకుంటున్నారా? ఇలా చేయండి..