Australia Floods: నిన్న అగ్ని ప్రమాదాలు.. నేడు వరదలు.. ఆస్ట్రేలియాను వెంటాడుతోన్న ప్రకృతి వైపరీత్యాలు

|

Oct 20, 2022 | 7:54 AM

గత వారం రోజులుగా పడుతున్న కుండపోత వానలు పలు నగరాలు, పట్టణాలు, గ్రామాలను ముంచెత్తాయి. విక్టోరియా రాష్ట్రంలోని అనేక నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి.

Australia Floods: నిన్న అగ్ని ప్రమాదాలు.. నేడు వరదలు.. ఆస్ట్రేలియాను వెంటాడుతోన్న ప్రకృతి వైపరీత్యాలు
Australia Floods
Follow us on

గతం ఎన్నడూ చూడని ప్రకృతి వైపరీత్యాను ఎదుర్కొంటోంది ద్వీపఖండ దేశమైన ఆస్ట్రేలియా.. భారీ వర్షాలు, వరదలతో అల్లాడిపోతోంది.ముఖ్యంగా విక్టోరియా, న్యూ సౌత్ వేల్స్, టాస్మానియా రాష్ట్రాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉందంటున్నారు. గత వారం రోజులుగా పడుతున్న కుండపోత వానలు పలు నగరాలు, పట్టణాలు, గ్రామాలను ముంచెత్తాయి. విక్టోరియా రాష్ట్రంలోని అనేక నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. మెల్‌బోర్న్‌కు వంద కిలో మీటర్ల దూరంలోని గౌల్‌బర్న్ నది ఈ వారం 1974 మే నాటి రికార్డు స్థాయి 25 అడుగులను దాటేయగడంతో షెప్పర్టన్‌ నగరంలోని వందలాది ఇళ్లు మునిగిపోయాయి. మారిబిర్నాంగ్ నది సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌ను ముంచెత్తింది. న్యూ సౌత్ వేల్స్‌లోని వాగ్గా, ఫోర్బ్స్‌ పట్టణాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. ఇక ఆస్ట్రేలియాలోని అతిపెద్ద నగరమైన సిడ్నీ ఈ ఏడాది అత్యధిక వర్షపాతం కలిగిన సంవత్సరంగా గుర్తింపు పొందింది.

నెలల పాటు పడాల్సిన వానలు ఒక్క వారంలోనే పడితే ఎలా ఉంటుంది? ఆస్ట్రేలియాను ఈ ఏడాది దారుణమైన వర్షాలు, వరదలు ముంచెత్తాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియా పరిస్థితి చూస్తుంటే అలాగే ఉంది. తాజాగా తూర్పు ఆస్ట్రేలియాలోని నదుల నదుల డ్యామ్స్‌ నిండుగా ఉన్నాయి. ఏ కొద్ది వాన పడ్డా, భారీ వరలు వచ్చే ప్రమాదం ఉంది. సాధారణంగా ఆస్ట్రేలియాలో వసంత రుతువు, వర్షాకాలంలో వానలు బాగా పడతాయి. అయితే గత మూడేళ్లుగా ‘లా నినా’ కారణంగా సాధారణంగాకన్నా అధిక వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ద్వీపఖండ దేశ వాతావరణం పసిఫిక్‌, హిందూ మహాసముద్రాల్లో జరిగే మార్పులపై ఆధారపడి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..