KA Paul: సైబీరియాలో కదా మనకెందుకు అనుకోవద్దు.. ప్లేగు లీక్‌పై కేఏ పాల్ కీలక హెచ్చరికలు

రష్యా సైబీరియాలోని యాంటీ-ప్లేగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ల్యాబ్‌‌లో ప్లేగు బ్యాక్టీరియా లీకై, ల్యాబ్ ఉద్యోగి మరణించిన గటనపై ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఎ పాల్ స్పందించారు. ఇది కూడా కోవిడ్ తరహా మహమ్మారేనని.. ప్రజలు దీని పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నిపుణులు సైతం దీనిపై ప్రజలకు సూచనలు చేశాయాలని కోరారు,

KA Paul: సైబీరియాలో కదా మనకెందుకు అనుకోవద్దు.. ప్లేగు లీక్‌పై కేఏ పాల్ కీలక హెచ్చరికలు
Russia Plague Lab Leak Incident

Updated on: Oct 05, 2026 | 1:14 PM

రష్యా సైబీరియాలోని ఇర్కుట్స్క్ నగరంలో తీవ్ర కలకలం రేగింది. అక్కడి యాంటీ-ప్లేగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ల్యాబ్‌‌లో ప్లేగు బ్యాక్టీరియా లీకై, ల్యాబ్ ఉద్యోగి దర్యా షిపిలోవా (28) న్యూమోనియాతో మరణించినట్లు రష్యా అధికారులు అధికారికంగా ప్రకటించారు. ప్లేగు కారణంగానే ఆమె మృతి చెందినట్లు స్పష్టం చేశారు. శాంపిల్ కలెక్ట్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ప్లేగు వ్యాధి టెస్ట్‌ట్యూబ్ పగిలిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు రష్యన్ స్టేట్ మీడియా ‘టాస్’ (TASS) పేర్కొంది. మరణించిన ఉద్యోగికి న్యూమోనియా లక్షణాలు ఉన్నట్లు తేలింది. అయితే ఇన్ఫెక్షన్ మూలాలపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదని ల్యాబ్ వర్గాలను ఉటంకిస్తూ టాస్ వెల్లడించింది.

200 మంది క్వారంటైన్ – మాస్క్ నిబంధనలు అమలు

ఈ ఘటన నేపథ్యంలో వ్యాప్తిని అరికట్టేందుకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. సుమారు 200 మంది స్థానికులను మెడికల్ అబ్జర్వేషన్‌లో ఉంచినట్లు తెలిపారు. అలాగే వ్యాధి మరింత విస్తరించకుండా నగరంలో విద్యాసంస్థలను మూసివేసి, మాస్క్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. మరోవైపు ఈ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు అమెరికా వైట్ హౌస్ పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తమతో పంచుకోవాలని అమెరికన్ అధికారులు రష్యాను కోరారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కేఏ పాల్

ఇదిలా ఉండగా ఈ ఘటనపై ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ స్పందించారు. ఇది కూడా కోవిడ్ లాంటి ప్రమాదకరమైన మహమ్మారేనని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గతంలో కోవిడ్ సమయంలోనూ తాను ముందే హెచ్చరించానని, కానీ ఆ మహమ్మారి కారణంగా కోట్ల మంది ప్రాణాలు కోల్పోయినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదన్నారు. ఎక్కడో సైబీరియాలో జరిగితే మనకెందుకులే అనుకోవడం పొరపాటని, ప్రతి ఒక్కరూ దీని పట్ల జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. ఈ ప్రమాదకరమైన ప్లేగు వ్యాధిపై నిపుణులు కూడా ప్రజలకు తగిన సూచనలు ఇవ్వాలని ఆయన కోరారు.

వీడియో చూడండి,.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us