Viral: పక్కింటి నుంచి తెల్లార్లు అదే మోత.. భరించలేక వృద్ధ దంపతులు ఏం చేశారో తెలిస్తే షాక్

|

Aug 23, 2022 | 7:42 AM

కోళ్లను ఇళ్లల్లో పెంచుకోవడం మనందరికీ తెలిసిందే. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇది సర్వసాధారణం. రోజంతా మేత కోసం తిరుగుతూ సాయంత్రానికి చక్కగా గూటికి చేరుకుంటాయి. ఉదయం కోడి కూశాకే నిద్ర లేచే పద్ధతి ఇప్పటికీ ఉంది. కోడి కూతతో...

Viral: పక్కింటి నుంచి తెల్లార్లు అదే మోత.. భరించలేక వృద్ధ దంపతులు ఏం చేశారో తెలిస్తే షాక్
Hen
Follow us on

కోళ్లను ఇళ్లల్లో పెంచుకోవడం మనందరికీ తెలిసిందే. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇది సర్వసాధారణం. రోజంతా మేత కోసం తిరుగుతూ సాయంత్రానికి చక్కగా గూటికి చేరుకుంటాయి. ఉదయం కోడి కూశాకే నిద్ర లేచే పద్ధతి ఇప్పటికీ ఉంది. కోడి కూతతో పనులు ప్రారంభించే వారు. వాటి అరుపు తక్కువ స్థాయిలోనే ఉంటుంది. అది మనకు అంత ఇబ్బందిగా అనిపించదు. కానీ జర్మనీలోని ఓ కోడి మాత్రం తన కూతతో స్థానికులను హడలెత్తిస్తోంది. అరుపులతో అదురు పుట్టిస్తోంది. ఇక కోడి అరుపులకు తట్టుకోలేక ఓ ఇంటి వాళ్లు కేసు పెట్టారు. కోడి అరుపుల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోర్టును ఆశ్రయించారు. పక్కింటివాళ్ల కోడి వేధిస్తోంది, భరించలేకపోతున్నాం అని ఆవేదన వ్యక్తం చేశారు. జర్మనీకి చెందిన వృద్ధ దంపతులు ఫ్రెడ్రిక్, జుటా ఓ ఇంట్లో నివాసముంటున్నారు. వారి ఇంటి సమీపంలోనే మరో ఇంట్లో కోడి ఉంది. అది కూస్తూ అరుపులతో తమను ఇబ్బంది పెడుతోందని కోర్టుకు తమ గోడు వెల్లబోసుకున్నారు. వారు ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చిందంటే.. అది రోజుకు పది ఇరవై సార్లు కూస్తే పెద్ద సమస్యేమీ లేదు. కానీ అది రోజుకు 200 సార్లు కూస్తుండటంతో తాము ఈ పని చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఉదయం 8 గంటలకు మొదలయ్యే కూత సాయంత్రం వరకూ ఏ మాత్రం తగ్గడం లేదట. ఏళ్లుగా కొనసాగుతున్న ఈ గోలను భరించలేక పలు మార్లు యజమాని దృష్టికి తీసుకెళ్లారు. వారి వద్ద నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఇక చేసేదేమీ లేక వారు కోడి పై కేసు పెట్టారు.

కోడిని పక్కింటివారు వదులుకోలేరు. అది ఉంటే మేం ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నాం. తలుపులు, కిటికీలు తీస్తే విపరీతమైన చప్పుడు. చివరకు గార్డెన్‌కూ వెళ్లలేకపోతున్నాం. అందుకే పొద్దున లేస్తే కోడిచేసే చప్పుడును రికార్డు చేశాం. దీనిని న్యాయస్థానానికి సమర్పించాం. దాని దెబ్బకు చుట్టుపక్కల చాలా మంది తమ ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. వాళ్ల గురించి కూడా కేసులో ప్రస్తావించాం. కేసు లెమ్గో జిల్లా జడ్జి ముందుకు త్వరలో రానుంది.

– వృద్ధ దంపతుల ఆవేదన

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రైండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి