
రష్యా రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన విమానం కుప్పకూలిపోయింది. An-22 సైనిక రవాణా విమానం ఏడు మంది సిబ్బందితో రష్యాలో కూలిపోయింది. మాస్కోకు సమీపంలోని ఇవనోవో ప్రాంతంలో An-22 విమానం కూలిపోయినట్లు సమాచారం అందుతోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ విమానం రష్యన్ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందినది. ఏడుగురు సిబ్బందిని తీసుకెళ్లింది. An-22 ప్రపంచంలోనే అతిపెద్ద టర్బోప్రాప్ విమానం. టర్బోప్రాప్ విమానాలు ఇంధన-సమర్థవంతమైనవి. భారీ పేలోడ్‌లను కలిగి ఉంటాయి. ఎక్కువగా దేశీయ విమానాలు, కార్గో, సైనిక రవాణాకు ఉపయోగించడం జరుగుతుంది. ATR-72, Dash-8 కూడా టర్బోప్రాప్‌లే..! ఈ విమాన ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
An-22 ను 1960లలో కైవ్‌లోని O.K. ఆంటోనోవ్ ఏరోనాటికల్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ కాంప్లెక్స్ అభివృద్ధి చేసింది. ఈ విమానం 60 టన్నుల సరుకును, 290 మంది సైనికులను, 150 మంది పారాట్రూపర్లను మోయగలదు. గతంలో, సెప్టెంబర్ 4న, రియాజాన్ ప్రాంతంలో X-32 బెకాస్ విమానం కూలిపోయింది. ఈ తేలికపాటి విమానం అలెగ్జాండర్ నెవిస్లకీ జిల్లాలో కూలిపోవడంతో పైలట్ మరణించాడు. నవంబర్ 2025లో, రష్యన్ వైమానిక దళానికి చెందిన Su-30 ఫైటర్ జెట్ కూడా కరేలియాలో కూలిపోయి ఇద్దరు పైలట్లు మరణించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..