Pope Leo XIV: కొత్త పోప్‌గా కార్డినల్ రాబర్ట్ ప్రీవోస్ట్.. అమెరికా నుంచి ఎన్నికైన తొలి వ్యక్తిగా రికార్డ్!

రోమన్ కాథలిక్ చర్చి కొత్త పోప్‌ ఎన్నికయ్యారు. అమెరికాకు చెందిన రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రీవోస్ట్ కొత్త పోప్‌గా ఎన్నుకోబడ్డారు. సంప్రదాయం ప్రకారం గురువారం సిస్టీన్ చాపెల్ పైనుంచి తెల్లటి పొగ వెలువడటంతో, నూతన పోప్ ఎన్నిక పూర్తయినట్టు ప్రకటించబడింది.ఈ కొత్త పోప్‌కు పోప్ లియో- XIVగా నామకరణం చేశారు. 2 వేల సంవత్సరాల చర్చి చరిత్రలో అమెరికాకు చెందిన వ్యక్తి పోప్‌ కావడం ఇదే తొలిసారి.

Pope Leo XIV: కొత్త పోప్‌గా కార్డినల్ రాబర్ట్ ప్రీవోస్ట్.. అమెరికా నుంచి ఎన్నికైన తొలి వ్యక్తిగా రికార్డ్!
New Pope

Updated on: May 09, 2025 | 11:54 AM

రోమన్ కాథలిక్ చర్చి కొత్త పోప్‌ ఎన్నికయ్యారు. అమెరికాకు చెందిన రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రీవోస్ట్ కొత్త పోప్‌గా ఎన్నకోబడ్డారు. అమెరికా నుండి పోప్‌గా ఎన్నికైన తొలి వ్యక్తిగా రాబర్ట్ ప్రాన్సిస్‌ రికార్డు సృష్టించారు. రెండ్రోజుల సమావేశం తర్వాత సుమారు 133 మంది కార్డినల్స్‌ మూడింట రెండు వంతుల మెజారిటీతో రాబర్ట్‌ను పోప్‌గా ఎన్నిక చేశారు. కొత్త పోప్‌ ఎన్నిక పూర్తైనట్టు తెలియజేస్తూ సిస్టీన్ చాపెల్ పైనుంచి తెల్లటి పొగను విడుదల చేశారు. ఇక కొత్తగా ఎన్నికైన పోప్‌కు పోప్ లియో- XIVగా నామకరణం చేశారు.

అమెరికాలోని చికాగో నగరానికి చెందిన రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రీవోస్ట్ కాథలిక్ చర్చి కొత్త పోప్‌గా ఎన్నిక కావడంపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. కొత్త పోప్‌గా ఎన్నికైన రాబర్ట్ ఫ్రాన్సిస్ ట్రంప్ అభింనందనలు తెలిపారు. అమెరికాకు చెందిన వ్యక్తి పోప్‌గా ఎన్నికవడం ఎంతో గౌరవంగా ఉందని ట్రంప్ అన్నారు.

69 ఏళ్ల వయస్సు గల రాబర్ట్ ఫ్రాన్సిస్ ఆమెరికాలొని చికాగోకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. ఇయన తన కెరీర్‌లో ఎక్కువ కాలం పెరూలో మిషనరీగా గడిపాడు. ఇక 2023లో ఇయన కార్డినల్ అయ్యారు. తాజాగా పోప్‌గా ఎన్నికైన ఇయన 14వ పోప్ లియోగా వ్యవహరించనున్నారు. 2 వేల సంవత్సరాల చర్చి చరిత్రలో అమెరికాకు చెందిన వ్యక్తి పోప్‌ కావడం ఇదే తొలిసారి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..