Man gifts plot of land on Moon: వివాహ వార్షికోత్సవం రోజున ఏ భర్త అయినా తన భార్య కోసం ఏం చేస్తారు? ఏదో ఒక గిఫ్ట్ కొనిస్తారు. లేదంటే వస్తువునో, దుస్తులో, ప్రత్యేకమైంది మరేదో బహుమతిగా ఇస్తారు. మరీ అంబానీ లాంటి వాళ్లైతే పెద్ద పెద్ద భవంతులను గిఫ్ట్‌లుగా ఇస్తారు. కానీ ఇక్కడ ఓ వ్యక్తి భవంతులు కాదు, వస్తువులు కాదు, దుస్తులు కాదు.. అంతకు మించిన బహుమతిని తన భార్యకు గిఫ్ట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశాడు. రాజస్థాన్‌లో అజ్మీర్ ప్రాంతానికి చెందిన ధర్మేంద్ర అనిజ, సప్న అనిజ దంపతులు. వారి వివాహ వార్సికోత్సం సందర్భంగా తన భార్యకు ఏదైనా డిఫరెంట్‌గా బహుమతి ఇ్వవాలని ధర్మేంద్ర ప్లాన్ వేశాడు. అనుకున్నదే తడవుగా ఎవరూ ఊహించని రీతిలో చంద్రుడి ఉపరితలంపై 3 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసి తన భార్యకు బహుమతిగా ఇచ్చాడు. ఆ కోనుగోలుకు సంబంధించి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను ధర్మేంద్ర అనిజ తన భార్యకు సప్నకు అందజేశాడు. అది చూసి షాక్ అవడం సప్న వంతైంది. చంద్రుడికి సంబంధించి ప్రతి ఒక్కరికి ఏదో ఒక అభిప్రాయం కచ్చితంగా ఉంటుంది. అక్కడ ఉండిపోవాలనే భావన ఒక్కసారైనా వచ్చి ఉంటది. అలాంటి కలను తన భర్త సాకారం చేయడంతో సప్ప చాలా ఆనందం వ్యక్తం చేసింది.
ఇక అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని లూనా సొసైటీ ఇంటర్నేషనల్ అనే సంస్థ ద్వారా ధర్మేంద్ర ఈ భూమిని కొన్నాడు. కొనుగోలు ప్రక్రియ పూర్తి కావడానికి ఏడాది సమయం పట్టిందని ఆయన చెప్పుుకొచ్చాడు. నాకు తెలిసినంత వరకు రాజస్థాన్ నుంచి చంద్రుడిపై భూమి కొన్న తొలి వ్యక్తి తానే అనుకుంటానని, ఈ విషయంలో చాలా సంతోషంగా ఉన్నానని ధర్మేంద్ర చెప్పుకొచ్చాడు. ఇక ధర్మేంద్ర భార్య సంతోషానికి అవధుల్లేవనే చెప్పాలి. అసలు ధర్మేంద్ర ఇలాంటి సర్‌ప్రైజ్ ఇస్తాడని కలలో కూడా అనుకోలేదట.
Also read:
దేశంలో కలవరపెడుతున్న కొత్త కరోనా స్ట్రెయిన్.. మార్చిలోనే అడుగుపెట్టిందన్న ఐజీఐబీ