Viral Video: గాల్లో ఉండగానే విమానంలో మంటలు.. తర్వాత ఏం జరిగిందో చూడండి..

చైనాలో భారీ విమాన ప్రమాదం తప్పింది. గాల్లో ఉండగానే ఎయిర్‌ చైనాకు చెందిన విమానంలోని లగేజ్‌ క్యాబిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గమనించిన ఫ్లైట్‌లోని సిబ్బంది వెంటనే మంటలను అదుపుచేయడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video: గాల్లో ఉండగానే విమానంలో మంటలు.. తర్వాత ఏం జరిగిందో చూడండి..
Air Chian

Updated on: Oct 18, 2025 | 4:05 PM

తూర్పు చైనా నగరం హాంగ్ జౌ నుండి దక్షిణ కొరియాలోని సియోల్ సమీపంలోని ఇంచియాన్ అంతర్జాతీయ విమానాశ్రం మధ్య రాకపోకలు సాగించే ఎయిర్‌ చైనా CA139 విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విమానంలోని లగేజ్‌ క్యాబిన్‌లో ఒక ప్రయాణీకుడు తెచ్చిన లగేజీలో ఉన్న లిథియం బ్యాటరీ ఆకస్మికంగా పేలడంతో విమానంలో మంటలు చెలరేగాయి. దీంతో విమానంలో ఉన్న ప్రయాణికులు అందరూ భయాందోళనకు గురయ్యారు.

మంటలను గమనించిన విమాన సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం కాకపోవడంతో విమానంలో ప్రయాణికులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఫ్లైట్‌లో మంటు చెలరేగడాన్ని ఒక ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ట్రెండింగ్ మారాయి.

వైరల్‌ వీడియో ప్రకారం.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న దృశ్యాల్లో విమానంలో మంటలు చెలరేగడం మనం చూడచ్చు. విమానం క్యాబిన్‌లో నల్లటి పొగ కమ్ముకున్నట్లు చిత్రంలో కనిపించింది. అలాగే మంటలను అదుపుకు చేసేందుకు ఒక ప్రయాణికులు ప్రయత్నించడం కూడా మనం చూడవచ్చు.

వీడియో చూడండి..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.