Watch: ఇస్కాన్ రెస్టారెంట్‌లో చికెన్ తింటూ వ్యక్తి హల్‌చల్.. భక్తుల ఆగ్రహం.. వీడియో వైరల్

ఇస్కాన్ రెస్టారెంట్‌లో ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. చికెన్ తింటూ నానా హంగామా చేశాడు. సిబ్బంది చెప్పినా వినకుండా మిగితావారికి ఇచ్చేందుకు ట్రై చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హిందూ భక్తులు అతడిపై తీవ్రంగా మండిపడుతున్నారు.

Watch: ఇస్కాన్ రెస్టారెంట్‌లో చికెన్ తింటూ వ్యక్తి హల్‌చల్.. భక్తుల ఆగ్రహం.. వీడియో వైరల్
Iskcon Restaurant

Updated on: Jul 20, 2025 | 6:05 PM

విదేశాల్లో హిందూ దేవాలయాలపై దుండగులు దాడి చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. అంతేకాకుండా ఇటీవల కెనడాలో ఇస్కాన్ రథయాత్ర ర్యాలీలో భక్తులపై ఓ వ్యక్తి గుడ్లను విసిరి.. జాత్యాహంకారాన్ని ప్రదర్శించాడు. అయినా భక్తులు ఆగిపోకుండా ర్యాలీని కొనసాగించారు. దేవుడి యాత్రను ఎవరు ఆపలేరని వ్యాఖ్యానించారు. ఆ ఘటన మరవక ముందే లండన్‌లో ఓ వ్యక్తి పిచ్చి చేష్టలకు దిగాడు. మత విశ్వాసాలను అవమానించే విధంగా వ్యవహరించాడు. ఇస్కాన్ రెస్టారెంట్‌లో నాన్ వెజ్ తిని హంగామా చేశాడు. సిబ్బంది ఎంత చెప్పినా వినలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చర్యను కూడా జాత్యాంహకార ఘటనగా హిందూ భక్తులు ఆరోపిస్తున్నారు.

లండన్‌లోని ఇస్కాన్ గోవింద రెస్టారెంట్‌లో ఓన్లీ వెజ్ మాత్రమే ఉంటుంది. అయితే ఆఫ్రికా సంతతికి చెందిన బ్రిటీష్ వ్యక్తి రెస్టారెంట్‌కు వచ్చి నాన్ వెజ్ ఉందా అని అడిగాడు. నాన్ వెజ్ ఉండదని.. ఓన్లీ వెజ్ మాత్రమే ఉంటుందని సిబ్బంది సమాధానమిచ్చారు. వెంటనే అతడు కేఎఫ్‌సీ బాక్స్ ఓపెన్ చేసి చికెన్ తినడం మొదలు పెట్టాడు. అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న కస్టమర్లకు సైతం దాన్ని అందించే ప్రయత్నం చేశాడు. ఇంతలో ఓ కస్టమర్ అతడిని అడ్డుకుని.. ఇక్కడ నాన్ వెజ్ తినకూడదని.. మీరు చేస్తున్నది కరెక్ట్ కాదని చెప్పాడు. అయినా ఆ వ్యక్తి వినకపోవడంతో భద్రతా సిబ్బంది వచ్చి బయటకు పంపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నెటిజన్లు తీవ్రంగ మండిపడుతున్నారు. మత విశ్వాసాలను అవమానించేందుకు అతడు ఇలా ప్రవర్తించాడని.. అతడిపై తగిన చర్యలు తీసుకోవాని కామెంట్లు చేస్తున్నారు. సదరు వ్యక్తిపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైనట్లు తెలుస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..