Africa Corona Vaccine: ఆఫ్రికాకు చేరిన మరో 40 కోట్ల ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్‌ డోసులు

Africa Corona Vaccine: ఆఫ్రికా ఖండంలోని దేశాలకు మరో 40 కోట్ల ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్‌ డోసులు అందే ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో

Africa Corona Vaccine: ఆఫ్రికాకు చేరిన మరో 40 కోట్ల ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్‌ డోసులు

Updated on: Jan 29, 2021 | 5:58 AM

Africa Corona Vaccine: ఆఫ్రికా ఖండంలోని దేశాలకు మరో 40 కోట్ల ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్‌ డోసులు వచ్చినట్లు ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. అయితే గతంలో ఫైజర్‌, ఆస్ట్రాజెనెకా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ తదితర కంపెనీల నుంచి 27 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ను ఆఫ్రికా దేశాలకు సరఫరా చేసేలా ఒప్పందాలు కుదిరాయి. ఇప్పుడు మరో 40 కోట్ల డోసులు పంపిణీ అయ్యేందుకు లైన్‌ క్లియర్‌ అయింది. భారత్‌ నుంచి కూడా కోటి వ్యాక్సిన్‌ డోసులు ఆఫ్రికా దేశాలకు అందజేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.

ఆఫ్రికా దేశాల్లోని ఆరోగ్యశాఖ అధికారులు రానున్న మూడు సంవత్సరాల్లో 60 శాతం ఆఫ్రికా ప్రజలకు వ్యాక్సిన్‌ అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు. ఈ దేశాలలో మొత్తం కలిపి సుమారు 130 కోట్ల మంది జనాభా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో 60 శాతం మందికి వ్యాక్సిన్‌ అందించడమే ఆరోగ్య కార్యకర్తల లక్ష్యం.

Also Read: Corona Vaccination: దేశంలో ఒక్క రోజే 5 లక్షల మందికి కోవిడ్‌ టీకా.. ఇప్పటి వరకు 28,47,608 టీకాల పంపిణీ