Afghanistan Crisis: పంజ్‌షేర్‌ వ్యాలీలో అసలేం జరుగుతోంది..? ప్రజెంట్ సిట్యువేషన్ ఇది

|

Sep 05, 2021 | 9:35 PM

పంజ్‌షేర్‌ ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రపంచంపై ఉందని ఐక్యరాజ్యసమితికి లేఖ రాశారు ఆఫ్ఘన్‌ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలాహే. తాలిబన్లు రవాణా వ్యవస్థను ధ్వంసం చేయడంతో ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Afghanistan Crisis: పంజ్‌షేర్‌ వ్యాలీలో అసలేం జరుగుతోంది..? ప్రజెంట్ సిట్యువేషన్ ఇది
Afghanistan Panjshir
Follow us on

ఆఫ్ఘనిస్తాన్‌ లోని పంజ్‌షేర్‌ వ్యాలీలో ఏం జరుగుతుందో ఎవరికి అర్ధం కావడం లేదు. పంజ్‌షేర్‌ వ్యాలీ నుంచి తాలిబన్లను తరిమికొట్టామని తాజాగా నార్తర్న్‌ అలయెన్స్‌ ప్రకటించింది. ఈ ప్రకటన విడుదల అయిన కాసేపటికే తాలిబన్లు కౌంటర్‌ వీడియో విడుదల చేశారు. పంజ్‌షేర్‌లో కీలకమైన ఎయిర్‌పోర్ట్‌ తాము స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించారు. నార్తర్న్‌ అలయెన్స్‌కు చెందిన హెలికాప్టర్లను , ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు తాలిబన్లు వెల్లడించారు. 1000 మంది తాలిబన్లు తమ దాడుల్లో హతమయ్యారని , మరో 1000 మందిని బందీలుగా పట్టుకున్నామని కూడా రెసిస్టెంట్స్‌ ఫోర్స్‌ ప్రకటించింది.

పంజ్‌షేర్‌ వ్యాలీలో వాస్తవ పరిస్థితిని ఎవరు అంచనా వేయలేకపోతున్నారు. పంజ్‌షేర్‌ మినహా ఆఫ్ఘన్‌ లోని అన్ని ప్రాంతాలను ఆక్రమించిన తాలిబన్లకు ముందు ముందు మరిన్ని ఎదురుదెబ్బలు ఖాయమన్న వార్తలు వస్తున్నాయి. తజకిస్తాన్‌ మినహా ప్రపంచదేశాల నుంచి ఎలాంటి సాయం అందకపోయినప్పటికి పంజ్‌షేర్‌ ఫైటర్లు వీరోచింతంగా పోరాడుతున్నారు. తాలిబన్లు లోయ లోని ప్రధాన పట్టణాలకు రాకుండా చాలా వంతెనలను పేల్చేశారు. అల్‌ఖైదా ఉగ్రవాదుల సాయం కూడా తీసుకొని పంజ్‌షిర్‌పై అటాక్‌ చేస్తున్నారు తాలిబన్లు. ఐనా సరే ఢీ అంటే ఢీ అంటూ తాలిబన్లపై సవిరుచుకుపడుతున్నారు పంజ్‌షిర్‌ ఫైటర్స్‌. చావో రేవో తేల్చుకుంటామని..ప్రాణాలు పోయినా వెనక్కి తగ్గేదే లేదంటున్నారు.

పంజ్‌షేర్‌ ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రపంచంపై ఉందని ఐక్యరాజ్యసమితికి లేఖ రాశారు ఆఫ్ఘన్‌ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలాహే. తాలిబన్లు రవాణా వ్యవస్థను ధ్వంసం చేయడంతో ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాలిబన్లు దాడుల తరువాత రెండు లక్షల మంది పంజ్‌షేర్‌లో తలదాచుకుంటున్నారని , వాళ్లను ఆదుకోవాలని కోరారు. తాలిబన్ల నుంచి రక్షణ కల్పించాలని కోరారు. ఘోర్‌ ప్రాంతంలో నెగర్‌ అనే మాజీ మహిళా పోలీసు అధికారిని దారుణంగా కాల్చి చంపి తమ నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారు తాలిబన్లు. ఒకవేళ యుద్దంలో తనకు గాయాలు తగిలితే తాలిబన్లను లొంగేది లేదని , తనను కాల్చేయాలని బాడీగార్డ్స్‌ను కోరారు సలాహే.

మరోవైపు తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించబోమని ఇరాన్‌ కీలక ప్రకటన చేసింది. ఆఫ్ఘనిస్తాన్‌ ప్రజాస్వామ్యయుతంగా ఎన్పికలు జరగాలని కోరుకుంటునట్టు తెలిపింది. తాలిబన్ల ప్రభుత్వ ఏర్పాటులో ట్విస్టుల మీద ట్విస్టులు నెలకొంటున్నాయి. ఇవాళ, రేపు అంటూ వాయిదాల పర్వం నడుస్తోంది. ఐతే మరో మూడు వారాల తర్వాతే తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటుకానున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తాలిబన్ల మధ్య అంతర్గత విభేదాలున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.రెండ్రోజులుగా ప్రభుత్వ ఏర్పాటుపై కీలక ప్రకటనలు అంటూ వార్తలొచ్చాయి..కానీ అలాంటిదేమీ లేదు. ఐతే తాము అంతర్జాతీయ మద్దతు కోసం ఎదురుచూస్తున్నామని..అందుకోసమే జాప్యం జరుగుతున్నట్లు వెల్లడించారు తాలిబన్లు. వచ్చేవారం ప్రభుత్వ ఏర్పాటు, కేబినెట్‌ వివరాలు వెల్లడిస్తామంటున్నారు.

Also Read:  టాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఈ హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టారా…?

దిశ ఘటనలో ఊహించని ట్విస్ట్… బాలీవుడ్, టాలీవుడ్‌కు చెందిన 38 మంది సినీ ప్రముఖులపై కేసు