Afghan Crisis: ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల వశమైన నాటినుంచి అరచకాలు పెరిగడిపోతున్నాయి. నిత్యం తాలిబన్లు ప్రజలపై దారుణాలకు పాల్పడుతున్నారు. ప్రజల పట్ల క్రూర మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఆ దేశంలో ఆధిపత్యపోరు నెలకొంది. ఆఫ్ఘన్ ప్రతిఘటన దళాలు, తాలిబన్లకు మధ్య అంతర్యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ లోని పంజ్‌షీర్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు తాలిబన్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇక మహిళలపై దారుణాలకు పాల్పడుతున్నారు తాలిబన్లు. ఆఫ్గాన్‌లోని ఘోర్ ప్రాంతంలో నెగర్ అనే మహిళా పోలీసు అధికారిని దారుణంగా కాల్చి చంపినట్లు ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసినట్లు నివేదికలు వెలువడుతున్నాయి.. జైల్లో పని చేసే నెగర్ అనే మహిళ ఎనిమిది నెలల గర్భవతి. మరోవైపు ఆమె హత్యతో తమకు సంబంధం లేదని తాలిబన్లు ప్రకటించారు. ఇక తాలిబన్లు దాడుల తరువాత రెండు లక్షల మంది పంజ్‌షేర్‌లో తలదాచుకుంటున్నారని, వాళ్లను ఆదుకోవాలని ఆఫ్ఘన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలాహే కోరారు. తాలిబన్ల నుంచి రక్షణ కల్పించాలని కోరారు. ఘోర్ ప్రాంతంలో నెగర్ అనే మాజీ మహిళా పోలీసు అధికారిని దారుణంగా కాల్చి చంపి తమ నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారు తాలిబన్లు. తాలిబన్ల అరాచకాలతో మహిళలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. అధ్యక్ష భవనంవైపు వెళ్లేందుకు ప్రయత్నించగా, టియర్ గ్యాస్, పెప్పర్ స్ప్రేతో ఉగ్రవాదులు తమను అడ్డుకున్నారని నిరసనకారులు తెలిపారు.
అయితే.. ఆఫ్ఘన్‌లోని పంజ్‌షీర్‌పై ఆధిపత్యం సాధించామని తాలిబన్లు ప్రకటించిన మరునాడే.. 600 మంది తాలిబన్లను మట్టుబెట్టినట్లు పంజ్‌షీర్ దళం చేసిన ప్రకటనలతో అంతటా గందరగోళం నెలకొంది. అసలు వాస్తవ పరిస్థితి ఏమిటనే చర్చ జోరుగా సాగుతోంది. పరస్పర విరుద్ధమైన ప్రకటనలతో ప్రస్తుతం గందరగోళం ఏర్పడింది. అయితే.. దేశం మొత్తం ఆక్రమించిన తాలిబన్లు.. పంజ్‌షీర్ ప్రావిన్స్‌పై మాత్రం పైచేయి సాధించలేకపోయారు. ఎందుకంటే.. అక్కడ తాలిబన్లకు వ్యతిరేకంగా దళం పోరాటం చేస్తోంది.
అంతేకాకుండా తాలిబన్ల సంబరాలు హద్దులు మీరి చేసుకోవడంతో.. తుపాకుల దాటికి అమాయకులైన 17మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, దాదాపు 41మంది వరకూ గాయాలపాలైయ్యారు. ప్రస్తుతం బాధితులు కాబూల్ లోని ఎమర్జెన్సీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులను ననగర్హార్ ప్రాంతం నుంచి కాబుల్ ఆస్పత్రికి తరలించామని అధికారులు వెల్లడించారు.
“Nigara a police officer was shot dead infront of her kids and husband last night at 10PM in Ghor province. Nigara was 6 months pregnant, she was shot dead by the Taliban.” Her family members says. pic.twitter.com/w5vs1Eahsq
— BILAL SARWARY (@bsarwary) September 5, 2021
Afghanistan Crisis: పంజ్‌షీర్‌లో తాలిబన్లకు ఎదురుదెబ్బ.. 6 వందల మంది హతం..!