Panjshir: దెబ్బకు దెబ్బ.. ప్రాణానికి ప్రాణం.. తాలిబన్లపై ప్రతీకారం తీర్చుకుంటాం.. గర్జిస్తున్న పంజ్‌షీర్‌ సింహం..

|

Sep 07, 2021 | 1:14 PM

యుద్ధం ముగియలేదు.. వార్‌ స్టిల్ కంటిన్యూ..దెబ్బకు దెబ్బ..ప్రాణానికి ప్రాణం..తాలిబన్లపై తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాం..చివరి రక్తపు బొట్టు వరకు పోరాడుతామంటున్నారు.

Panjshir: దెబ్బకు దెబ్బ.. ప్రాణానికి ప్రాణం.. తాలిబన్లపై ప్రతీకారం తీర్చుకుంటాం.. గర్జిస్తున్న పంజ్‌షీర్‌ సింహం..
Battle For Panjshir Ahmad M
Follow us on

యుద్ధం ముగియలేదు.. వార్‌ స్టిల్ కంటిన్యూ..దెబ్బకు దెబ్బ..ప్రాణానికి ప్రాణం..తాలిబన్లపై తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాం..చివరి రక్తపు బొట్టు వరకు పోరాడుతామంటున్నారు NRF లీడర్‌ అహ్మద్‌ మసూద్‌. అన్నట్టుగానే పంజ్‌షీర్‌లో తాలిబన్లపై విరుచుకుపడుతున్నారు. నార్తర్న్‌ అలయన్స్‌ దాడిలో తాలిబన్ల సీనియర్‌ కమాండర్‌ ఫసీయుద్దీన్‌ మౌల్వీ హతమయ్యాడు. ఫసీయుద్ధీన్ సహా మరో 13 మందిని మట్టుబెట్టాయి పంజ్‌షీర్ రెసిస్టెన్స్ ఫోర్సెస్‌. కుటుంబసభ్యులు, ముఖ్య అనుచరులను కోల్పోయినా సరే.. వెనకడుగు వేయడం లేదు మసూద్‌. సింహంలా  గర్జిస్తున్నాడు. యావత్‌ ఆఫ్ఘన్‌ పౌరులను తాలిబన్లపై పోరుకు సిద్ధం చేస్తున్నాడు. వారిలో ఉద్యమ కాంక్ష రగిలేలా ఫేస్‌బుక్‌లో ఓ ఆడియో మెసేజ్‌ పంపించాడు.

తాలిబన్లపై తిరగబడండి.. తిరుగుబాటు బావుటా ఎగరేయండి అంటూ ఆఫ్ఘన్‌ పౌరుల్లో పోరాట స్ఫూర్తిని రగిలిస్తున్నాడు మసూద్‌. ఎప్పటికీ తాలిబన్ల పాలన అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నాడు. పంజ్‌షిర్‌పై దాడిలో పాక్‌ హస్తం కూడా ఉందని ఆరోపిస్తున్నాడు. ముష్కరులతో కలిసి కుట్రలు చేస్తున్నా..ధైర్యం కోల్పోవద్దు..చివరి రక్తపు బొట్టు వరకూ పోరాడుదాం..చావో రేవో తేల్చుకుందాం..పోరాటానికి సిద్ధం కండి అంటూ పిలుపునిచ్చాడు. మసూద్ ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆఫ్ఘన్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకున్నామన్న తాలిబాన్ల ప్రకటనను ఖండించాయి రెసిస్టెన్స్‌ ఫోర్సెస్‌. తాము చివరివరకూ పోరాడతామని ప్రకటించారు. పాక్‌ కనుసన్నల్లోనే పంజ్‌షిర్‌పై డ్రోన్లతో అటాక్‌ చేశారని..ఈ దాడుల్లో రెబెల్స్‌ అధికార ప్రతినిధి ఫయీమ్‌ దాస్తీ, మసూద్‌ మేనల్లుడు కూడా మృతి చెందినట్లు ప్రకటించారు.

ఐతే నిన్న పంజ్‌షిర్‌ను హస్తగతం చేసుకున్నామని ప్రకటించిన తాలిబన్లు..ఇవాళ యూఎస్‌ ఎంబసీని కూడా స్వాధీనం చేసుకున్నారు. యూఎస్‌ ఎంబసీతో పాటు కాబూల్‌ ఎయిర్‌పోర్ట్‌ పైనా తమ జెండాలను ఎగురవేశారు. యూఎస్‌ ఎంబసీ గోడల మీద తాలిబన్‌ చిహ్నాలను ముద్రించారు.

ఇక ఆఫ్ఘన్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు తాలిబన్లు. ఐతే ఆఫ్ఘన్‌ కొత్త అధ్యక్షుడెవరు..? అన్న అంశంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. తాజాగా కొత్త పేరు తెరపైకొచ్చింది. బారాదార్‌ ప్లేస్‌లో ముల్లా హసన్‌ అఖుంద్‌..అధ్యక్ష పగ్గాలు చేపడతారని ప్రచారం జరుగుతోంది. ఐతే అధ్యక్షుడిగా అఖుంద్‌ పేరును ప్రకటించడంపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐతే ఆఫ్ఘనిస్థాన్‌ అంతర్గత వ్యవహారాల్లో ఏ దేశాన్నీ వేలుపెట్టనివ్వమని స్పష్టం చేస్తున్నారు తాలిబన్లు. పాక్ సహా ఏ దేశానికి అవకాశం ఇవ్వబోమని ప్రకటించారు.

ఇవి కూడా చదవండి: వీరిది సహాపంక్తి భోజనం.. తినడానికి పొంగలి.. రుచికరమైన వంటకాలు.. కానీ ప్లేట్లు.. విస్తరాకుల్లో కాదు.. మరీ ఎలా తింటారో తెలుసా..

Acharya Chanakya: నీరు.. డబ్బు.. ఒకటే.. సంపాదించిన సంపదను ఏం చేయాలో చెప్పిన చాణక్యుడు..