Afghanistan crisis- Gold Mines: ప్రజాస్వామ్యం నుంచి తాలిబన్ల చేతికిఇ వెళ్ళిపోయింది ఆఫ్గనిస్తాన్. ప్రసుత్తం ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా అక్కడ జరుగుతున్న మారణకాండ గురించే.. అయితే ఇప్పుడు అక్కడ ఉన్న సహజ వనరులపై ప్రపంచం దృష్టి పడింది. అక్కడ బంగారం, రాగి, లిథియం ఖనిజ వనరులు భారీగా ఉన్నాయి. ఈ సహజ వనరుల విలువ ట్రిలియన్ డాలర్లకు పైగా ఉండవచ్చని ఒక అంచనా. అయిదు ఇప్పుడు ఈ సహజ సంపద పై హక్కు ఎవరికీ.. ఒకవేళ ఇంత సంపద తాలిబన్ల హస్తగతం అయితే ప్రపంచం పరిస్థితి ఏమిటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఆఫ్గనిస్తాన్ లోని కొండకోనల్లో, లోయల్లో విలువైన బంగారం, పాలరాయి వంటి ఖనిజ సంపదతో పాటు రాగి, బాక్సైట్, ఇనుము లాంటి లోహాలు ఉన్నాయి. ఇదే విషయాన్ని1960లో సోవియట్, అమెరికన్ శాస్త్రవేత్తలు గతంలోనే ప్రకటించారు. వాటిని ఇప్పటి వరకూ ఏ దేశజం వెలికి తీసి వినియోగించుకోలేదు. అయితే సహజ సంపదను తవ్వి తీసేందుకు అఫ్గానిస్తాన్‌తో భారతదేశం, బ్రిటన్, కెనడా, చైనాల పెట్టుబడిదారులు పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. అయితే ఇప్పటి వరకూ ఏ దేశంలోని వారు తవ్వకాలు ప్రారంభించలేదు. కర్మాగారాలు కట్టలేదు. భూమి నుంచి ఏ లోహాన్ని వెలికి తీయలేకపోయారు. అయితే అక్రమంగా చేతి పద్ధతుల ద్వారా మణులు, పచ్చలు, మాణిక్యాలు వెలికితీసేవారు.. అంతేకానీ ఇంతవరకు ఎవరూ అధికారింగా మైనింగ్ ప్రారంభించలేదు. ప్రపంచ బ్యాంకు ప్రకారం వాణిజ్యానికి అనువైన దేశాల ర్యాంకింగ్‌లో 190 దేశాల జాబితాలో అఫ్గానిస్తాన్ 173వ స్థానంలో ఉంది.
ఖనిజాల కన్నా నల్లమందుపై అఫ్గాన్ ఆర్థికవ్యవస్థ ఎక్కువగా ఆధారపడింది. నల్లమందు ఉత్పత్తి, వినియోగం, ఎగుమతి ఆ దేశంలోని మొత్తం ఆర్థిక కార్యకలాపాల్లో సుమారు 10 శాతం ఉంటుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. అయితే ఇక్కడ మూడు ట్రిలియన్ డాలర్ల విలువైన లిథియం, ఇతర అరుదైన లోహాల నిల్వలు ఉన్నాయని ఒక అంచనా. వీటిని వెలికి తీయడానికి డబ్బు, సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక సదుపాయాలు అవసరం. ప్రస్తుతం అఫ్గానిస్తాన్ వద్ద అవి లేవు. మరి తాలిబన్ల పాలనలోకి ఆఫ్గన్ వచ్చిన నేపథ్యంలో అమెరికా వంటి దేశాలతో పాటు, ప్రపంచ బ్యాంక్ కూడా ఆర్ధిక ఆంక్షలు అమలు చేస్తూ.. ఆర్ధిక సాయం నిలిపి వేశాయి. దీంతో ఇప్పుడు తాలిబన్లు.. ఈ కొన్ని కోట్ల డాలర్లు విలువ జేసే సహజ వనరులను ఏ విధంగా వినియోగిస్తారో అంటూ ప్రపంచ దేశాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
Also Read: Krishna-Peacock Feather: కృష్ణుడు భోగిగా కనిపించే యోగి.. అందుకు చిహ్నమే కన్నయ్య తలపై ‘నెమలి పించం’