Afghanistan Crisis: ఖజానాను దొంగిలించాడు.. అష్రఫ్‌ ఘనీని అరెస్ట్ చేయండి.. ఇంటర్‌పోల్‌కు ఆఫ్గన్ రాయబార కార్యాలయం ఫిర్యాదు..

|

Aug 18, 2021 | 8:14 PM

Afghanistan Crisis: తజికిస్తాన్‌లోని ఆఫ్గనిస్తాన్ రాయబార కార్యాలయం.. ఆఫ్గనిస్తాన్ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ, ఆఫ్గన్ జాతీయ భద్రతా సలహాదారు అహ్మదుల్లా..

Afghanistan Crisis: ఖజానాను దొంగిలించాడు.. అష్రఫ్‌ ఘనీని అరెస్ట్ చేయండి.. ఇంటర్‌పోల్‌కు ఆఫ్గన్ రాయబార కార్యాలయం ఫిర్యాదు..
Prevent Further Instability Says Afghanistan President Ashraf Ghani
Follow us on

Afghanistan Crisis: తజికిస్తాన్‌లోని ఆఫ్గనిస్తాన్ రాయబార కార్యాలయం.. ఆఫ్గనిస్తాన్ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ, ఆఫ్గన్ జాతీయ భద్రతా సలహాదారు హమ్మదుల్లా మోహిబ్, ఘనీ మాజీ ప్రధాన సలహాదారు ఫజెల్ మహమూద్‌ను అరెస్టు చేయాలని ఇంటర్‌పోల్ అధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ ముగ్గురూ ఆఫ్గనిస్తాన్ ఖజానాను దొంగిలించారని ఆరోపించింది. ప్రజల సంపదను పునరుద్ధరించడానికి అంతర్జాతీయ ట్రిబ్యునల్‌కు ట్రెజరీని అప్పగించాలని ఆఫ్గన్ రాయబార కార్యాలయం డిమాండ్ చేసింది. ఈ మేరకు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి.

తాలిబన్లు కాబూల్‌ని తమ ఆధీనంలోకి తీసుకున్న నేపథ్యంలో.. ఆదేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ పారిపోయాడు. ఈ క్రమంలో తజికిస్తాన్ ఆశ్రయం పొందగా.. ఆదేశం నిరాకరించింది. దాంతో అతను ఒమన్‌కు చేరుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ఘనీ ఆప్గనిస్తాన్‌కు పొరుగున్న ఉన్న తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌కు పారిపోయి ఉండొచ్చని అనేక కథనాలు ప్రసారం అవుతున్నాయి. అయితే, ఆయన ఆచూకీ ఇప్పటికీ తెలియదు.

కాగా, అష్రఫ్ ఘనీ నాలుగు కార్లు, ఒక హెలికాప్టర్ నిండా నగదుతో దేశం విడిచి పారిపోయాడని, ఈ వాహనాలు సరిపోకపోవడంతో కొంత డబ్బును వదిలిపెట్టాల్సి వచ్చిందని రాష్యాకు చెందిన ఆర్ఐఏ న్యూస్ ఏజెన్సీ కొన్ని కథనాలను ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలో తజికిస్తాన్‌లోని ఆఫ్గన్ రాయబార కార్యాలయం అష్రఫ్ ఘనీని అరెస్ట్ చేయాలని ఇంటర్ పోల్ అధికారులను కోరడం విశేషం.

ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్లు రెచ్చిపోవడంతో.. దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశాన్ని విడిచి పారిపోవడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే, దేశంలో రక్తపాతాన్ని నివారించడానికే తాను దేశం విడిచి వెళ్లిపోయానని ఘనీ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడదుల చేశారు. అధ్యక్ష భవనంలోకి ప్రవేశించాలనుకున్న తాలిబన్లను గత 20 ఏళ్లుగా ఎదుర్కొన్నానని, వారిని అడ్డుకునేందుకు తన జీవితాన్ని అంకితం చేశానని పేర్కొన్నారు. అలాంటిది ఇప్పుడు దేశాన్ని వీడిపోవటం బాధాకరమని పేర్కొన్నారు. విద్యావేత్త, ఆర్థికవేత్త అయిన అష్రఫ్ ఘనీ ఆఫ్ఘనిస్తాన్ 14వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సెప్టెంబర్ 20, 2014 న తొలిసారి అధ్యక్షుడిగా ఎన్నికైన అష్రఫ్.. సెప్టెంబర్ 28, 2019 ఎన్నికల్లో మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

ఇక ఆఫ్గనిస్తాన్ దేశాన్ని తాలిబన్లు 1996 నుంచి 2001 వరకు పాలించారు. అయితే, సెప్టెంబర్ 11, 2001 న అమెరికాపై దాడుల చేయడంతో.. తాలిబన్లు అగ్రరాజ్యం ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఫలితంగా 2001 సంవత్సరంలోనే ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల క్రూరమైన పాలన అంతమైంది. అమెరికా దళాలు తాలిబన్ల అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. అనంతరం అక్కడ ప్రజాస్వామ్యబద్దమైన ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేశారు.

Also read:

Viral Video: కుక్కను వేటాడిన పిల్లులు.. భయంతో పరుగు లంకించుకున్న శునకం.. ఫన్నీ వీడియో మీకోసం..

Viral News: ప్రేయసి కోసం ఈ దునియాలోనే ఎవరూ చేయని పని చేశాడు.. ఆఖరికి అడ్డంగా బుక్కయ్యాడు..

Viral Video: చెట్టుపై మాటు వేసిన చిరుత.. ఊహించని రీతిలో ఎటాక్ చేసింది.. వీడియో చూస్తే హడిలిపోవాల్సిందే..