ఆఫ్ఘనిస్తాన్ లో పరిస్థితి రోజు రోజుకీ మారుతోంది. ఓ వైపు తాలిబన్లు కాబూల్ సహా మొత్తం దేశమంతా అకక్రమించుకుని తమ రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నట్టు వార్తలు వస్తుండగా మరోవైపు నిరసనకారులు (తిరుగుబాటుదారులు) వారికి వ్యతిరేకంగా పోరును ఉధృతం చేస్తున్నారు. మూడు జిల్లాలను వారి నుంచి వశం చేసుకున్నారు. కొంతమంది తాలిబన్లను కాల్చి చంపారు. ఆఫ్ఘన్ తిరుగుబాటుదారుల కాల్పుల్లో కొందరు తాలిబన్లు గాయపడ్డారు. ఖైర్ మహమ్మద్ అందార్బీ అనే వ్యక్తి నాయకత్వాన పబ్లిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ కి చెందిన సభ్యులు తాము పోల్-ఏ-హెసార్, బేసలాహ్, బాను అనే జిల్లాలను స్వాధీనపరచుకున్నామని, ఇతర జిల్లాల దిశగా కదలుతున్నామని ప్రకటించుకున్నారు. ఓ ఎత్తయిన ప్రదేశంలో వారు ఆఫ్ఘన్ జాతీయ పతాకాన్ని ఎగురవేయడం కనిపించింది. పోల్=ఎ-హెసార్ జిల్లాకాబూల్ కి ఉత్తర దిశగా ..పంజ్ షిర్ లోయకు దగ్గరలో ఉంది. ఇక్కడి నుంచే తిరుగు బాటుదారులు తమ పోరాటాన్ని ఆరంభించారు.తాలిబన్లను తరిమికొట్టేవరకూ తాము విశ్రమించబోమన్నారు. ఇలా ఉండగా కాందహార్, హెరాత్ ప్రావిన్స్ లలోని భారత దౌత్య కార్యాలయాలపై తాలిబన్లు దాడులు జరపలేదని కాబూల్ లోని భారత ఎంబసీ సిబ్బంది ఎలిపారు. వారు ఏఈ కార్యాలయాలపై దాడులు చేశారని, పలు డాక్యుమెంట్లను తమతో తీసుకువెళ్లారని వార్తలు వచ్చాయి. అయితే అలాంటి సంఘటనలేవీ జరగలేదని వారు చెప్పారు.
అలాగే ఈ కార్యాలయాల వద్ద పార్క్ చేసి ఉన్న వాహనాలను కూడా వారు తీసుకుపోయారని కూడా ఈ వార్తలు పేర్కొన్నాయి. కానీ ఆ విధమైన ఘటనలు జరగలేదని కాందహార్, మజారే -షరీఫ్ నగరాలలోని భారత దౌత్య కార్యాలయాల సిబ్బంది చెప్పారు. ఇలా పరస్పర విరుద్ధమైన వార్తలతో అఫ్గానిస్తాన్ లోని వాస్తవ పరిస్థితి ఏమిటో తెలియకుండా పోతోంది.
మరిన్ని ఇక్కడ చూడండి : సూపర్ మార్కెట్లో షాపింగ్ చేస్తున్న కొండచిలువ..ఆ తరువాత ఎం జరిగిందంటే..?:Python In Supermarket Video.
రాహుల్ గాంధీ నా కుమారుడు అంటున్న ఈమె ఎవరో తెలుసా..?మరిన్ని వివరాలు..:Rahul Gandhi Video.