చిన్న పామే కదా అని చేతిలోకి తీసుకుంది.. ఎంతో లక్కి అని నెటిజన్ల కామెంట్స్..
చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాలంటుంటారు. అంటే ఒక్కోసారి సమస్య చిన్నగా కనిపించినా ప్రమాదం తీవ్రత అధికంగా ఉండవచ్చని అర్థం. అందుకే ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా అప్రమత్తంగా..

చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాలంటుంటారు. అంటే ఒక్కోసారి సమస్య చిన్నగా కనిపించినా ప్రమాదం తీవ్రత అధికంగా ఉండవచ్చని అర్థం. అందుకే ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా అప్రమత్తంగా ఉండాలి. అందుకే పాము చిన్నదైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఓ 11 ఏళ్ల బాలిక ఓ చిన్న పామును చేత్తో పట్టుకుంది. అది అటూ ఇటూ కదులుతుంటే ఎంజాయ్ చేసింది. అయితే అది అత్యంత విషపూరితమైనదని తెలుసుకొని ఒక్కసారిగా అవాక్కైంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌కు చెందిన ఓ బాలిక తన గ్రాండ్ పేరెంట్స్‌తో బయటకు వెళ్లింది. ఆ సమయంలో ఆమెకు గోధుమ రంగులలో ఉండే ఒక చిన్న పాము కనిపించింది. వెంటనే ఆమె పామును తన చేతుల్లోకి తీసుకుంది. ఆ పాము తన అరచేతిలో అటు ఇటూ కదులుతూ ఉంది. పామును వదిలేయమని తన కుటుంబ సభ్యులు ఆమెకు చెప్పినా ఆమె పట్టించుకోలేదు.
అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఈ ఘటనను సెల్‌ఫోన్ తో వీడియో తీశాడు. దానిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. దీంతో ఆ వీడియో కాస్తా వైరల్ గా మారింది. దీనిపై ఓ స్నేక్ క్యాచర్ స్పందించాడు. ఆ పాము అత్యంత విషపూరితమైనదని తెలిపాడు. పాము విషయంలో చిన్నారి ఎంతో అదృష్టవంతురాలని, పొరపాటును ఆ పాము కాటు వేసి ఉంటే ఆమె స్పాట్‌లో చనిపోయి ఉండేదని తెలిపాడు. దీంతో, చిన్నారి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాకయ్యారు.




? @7NewsAustralia || Little girl picks up deadly eastern brown snake in Melbourne’s southwest in alarming video.
She told the video she had found a garter snake, which are harmless and native to north and central America.https://t.co/hUXYKkeyzG pic.twitter.com/K1sl454PTV
— PiQ (@PriapusIQ) October 22, 2022
కాగా.. ఈ పాముల కారణంగానే ఆస్ట్రేలియాలో అధిక మరణాలు సంభవిస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. చిన్నారి ఎంతో లక్కీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి విషయాల్లో పెద్దవాళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకూడదని కామెంట్లు చేస్తున్నారు.