Viral Video: న్యూయార్క్ నగరాన్ని ముట్టడించిన తేనెటీగల గుంపు.. అక్కడ ఏం జరుగుతోంది..?

|

Jun 15, 2023 | 10:41 AM

కొన్నిసార్లు తేనెటీగల గుంపులు కొత్త గూడును నిర్మించుకోవడానికి కొత్త స్థలాన్ని వెతుకుతూ ఎగురుతాయి. అలాంటప్పుడు మనుషులు తిరుగుతున్నా ఆ తేనెటీగలు ఎలాంటి దాడి చేయవు. ఇలాంటి ఘటనే ఓ నగరంలో చోటుచేసుకుంది. ఇక్కడ నగరమంతా తేనెటీగలు ఎగురుతూ కనిపించాయి.. ఇది చూసేందుకు వింతగా ఉండటంతో అక్కడి వారంతా ఆశ్చర్యంగా చూశారు.

Viral Video: న్యూయార్క్ నగరాన్ని ముట్టడించిన తేనెటీగల గుంపు.. అక్కడ ఏం జరుగుతోంది..?
New York City
Follow us on

ఒక జంట తేనెటీగలు కనిపించినా సరే, వాటిని చూస్తే జనం భయపడి పారిపోతారు. ఎందుకంటే తేనెటీగలు దాడి నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. అవి దాడి చేస్తే ఆ నొప్పిని భరించటం ఎవరి వల్ల కాదు. ఒక్కోసారి తేనెటీగల దాడి కారణంగా మనుషులు కొల్పోయిన ఘటనలు కూడా మనం చూస్తుంటాం. అయితే, తేనెటీగలు మనుషులపై కావాలని దాడి చేయవు. వాటి గూడును మనుషులు, మరేకారణంగానైనా పాడు చేస్తే.. తేనెటీగల సమూహం చొరబాటుదారుడిపై దాడి చేస్తుంది. కొన్నిసార్లు తేనెటీగల గుంపులు కొత్త గూడును నిర్మించుకోవడానికి కొత్త స్థలాన్ని వెతుకుతూ ఎగురుతాయి. అలాంటప్పుడు మనుషులు తిరుగుతున్నా ఆ తేనెటీగలు ఎలాంటి దాడి చేయవు. ఇలాంటి ఘటనే న్యూయార్క్‌లోని మాన్‌హాటన్‌లో చోటుచేసుకుంది. నగరమంతా తేనెటీగలు ఎగురుతూ కనిపించాయి.. ఇది చూసేందుకు వింతగా ఉండటంతో అక్కడి వారంతా ఆశ్చర్యంగా చూశారు. అంతే కాదు ఈ తేనెటీగలు టైమ్ స్క్వేర్ అద్దాల గోడపై కూడా గూడు కట్టుకున్నాయి. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతం కాబట్టి పౌరుల రాకపోకలకు అంతరాయం కలగకూడదు. మైకేల్ బ్లాంక్ అనే మహిళ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి తేనెటీగల పెంపకందారులను పిలిపించింది. అనంతరం భవనంపై భద్రంగా గూడు కట్టిన తేనెటీగలను చెక్క పెట్టెలో పెట్టి తరలించారు.

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జంతుశాస్త్రవేత్త మైఖేల్ బ్లాంక్ (@mickmicknyc) తన Instagram ఖాతాలో వీడియోను షేర్‌ చేశారు. మీరు వీడియోలో ఎక్కడ చూసినా వీధిలో లెక్కలేనన్ని తేనెటీగలు ఎగురుతూ కనిపించాయి. అక్కడక్కడా భవనాల అద్దాల గోడలపై కూడా తేనెటీగలు గూడు కట్టుకున్నాయి. తేనెటీగలు, పౌరుల భద్రత కోసం, తేనెటీగల పెంపకందారులను పిలిపించారు. ఈ తేనెటీగలు కొత్త గూడు కట్టుకోవడానికి చోటు కోసం ఇలా ఎగురుతాయి. దీనికి భయపడాల్సిన అవసరం లేదు. మీ నగరాల్లో ఇలాంటివి కనిపిస్తే, తేనెటీగలను సురక్షిత ప్రదేశానికి తరలించడానికి హెల్ప్‌లైన్‌కు కాల్ చేయండి. తేనెటీగల పెంపకందారులకు కాల్ చేయండి అంటూ.. మైఖేల్ బ్లాంక్ ప్రజలకు సలహా ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

వీడియోకు 528 వేల వ్యూస్, 22.9 వేల లైక్‌లు వచ్చాయి. అనేక కామెంట్లు కూడా వెల్లువెత్తాయి. ‘న్యూయార్క్ నగరంలో ఏదో జరుగుతోంది’ అని ఒక వినియోగదారు వ్యాఖ్యానించారు. మరో వినియోగదారు ‘తేనెటీగలను కాపాడే పని అద్భుతంగా ఉంది’ అని అన్నారు. మరో వినియోగదారు ‘మేము తేనెటీగలను రక్షించాలి. బహుశా అవి ఏదైనా అగ్ని ప్రమాదంలో తమ గూళ్ళను కోల్పోయి నగరంలోకి ఎగిరిపోయి రావొచ్చునని ఆందోళన వ్యక్తం చేశారు. చాలా మంది మైఖేల్ బ్లాంక్ మంచి పనిని ప్రశంసించారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి