Japan Earthquake: భూకంపం సంభవించిన 6 రోజుల తర్వాత శిథిలాల నుంచి బయటకు వచ్చిన 90 ఏళ్ళ వృద్ధురాలు

జపాన్‌లో న్యూ ఇయర్ రోజున భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో వందలాది మండి ప్రాణాలు కోల్పోయారు. అయితే తాజాగా ఆరు రోజుల తరువాత, 90 ఏళ్ల వృద్ధురాలు శిధిలాల నుండి సురక్షితంగా బయటకు తీశారు. పశ్చిమ జపాన్‌లో కూలిన ఇంటి నుంచి 90 ఏళ్ల వృద్ధురాలిని సజీవంగా బయటకు వచ్చారు.

Japan Earthquake: భూకంపం సంభవించిన 6 రోజుల తర్వాత శిథిలాల నుంచి బయటకు వచ్చిన 90 ఏళ్ళ వృద్ధురాలు
Rubble Ofjjapan Earthquake
Follow us

|

Updated on: Jan 07, 2024 | 3:20 PM

జపాన్‌లో న్యూ ఇయర్ రోజున భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో వందలాది మండి ప్రాణాలు కోల్పోయారు. అయితే తాజాగా ఆరు రోజుల తరువాత, 90 ఏళ్ల వృద్ధురాలు శిధిలాల నుండి సురక్షితంగా బయటకు తీశారు. పశ్చిమ జపాన్‌లో కూలిన ఇంటి నుంచి 90 ఏళ్ల వృద్ధురాలిని సజీవంగా బయటకు తీశారు. భూకంపం సంభవించిన 124 గంటల తర్వాత మహిళను రక్షించారు. ఇదిలావుంటే ఈ భూకంపంలో 126 మంది మరణించారు. చనిపోయిన వారిలో ఐదేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. భూకంపం వచ్చినప్పుడు వేడినీటిలో పడిపోయిన చిన్నారికి చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది.

జనవరి 1న సంభవించిన భూకంపంలో అత్యధిక మరణాలు వాజిమా నగరంలో సంభవించాయి. భూకంపం తర్వాత ఇక్కడ పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. జపాన్ సైనికులు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. సుమారు ముప్పై వేల మంది నిరాశ్రయులయ్యారు. వారికి నీరు, ఆహారం, మందులు, ఇతర సౌకర్యాలు కల్పించాయి సహాయక బృందాలు. ఇదిలావుంటే భూకంపం తర్వాత నివాస ప్రాంతాలను బాగు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం లేదని జపాన్ ప్రజలు వాపోతున్నారు. సెర్చ్ ఆపరేషన్ పూర్తయిన శిథిలాలను అలాగే వదిలేశారని చెప్పారు. శిథిలాల కారణంగా పలు ప్రాంతాల్లో రహదారులు మూసుకుపోయాయి.

భూకంపం సంభవించిన ప్రాంతంలో 100 కంటే ఎక్కువ కొండచరియలు విరిగిపడ్డాయి. ప్రధాన రహదారులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. సునామీ బారిన పడిన షిరోమారు తీరప్రాంత సమాజం వంటి కొన్ని సంఘాలు ఇప్పటికీ సహాయం కోసం ఎదురుచూస్తున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…