మరో దారుణం.. కూలిపోయిన హాట్‌ ఎయిర్‌ బెలూన్‌..8 మంది మృతి..

ఈ ప్రమాదంలో 13మంది ప్రాణాలతో బయటపడ్డారు. వారిని సమీప ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లుగా తెలిపారు. సావో పాలో రాష్ట్రంలో ఇలాంటి బెలూన్ ప్రమాదం జరిగిన వారం రోజులకే ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మరణించగా, 11 మంది గాయపడ్డారు. పండుగ సమయం విమానాల రాకపోకల నేపథ్యంలో ఇలాంటి హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ పర్యటన భద్రత పట్ల ప్రయాణికులు, పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తు్న్నారు.

మరో దారుణం.. కూలిపోయిన హాట్‌ ఎయిర్‌ బెలూన్‌..8 మంది మృతి..
Hot Air Balloon Crash

Updated on: Jun 21, 2025 | 8:47 PM

బ్రెజిలో ఘోర ప్రమాదం జరిగింది. జూన్ 21శనివారం రోజున హాట్ ఎయిర్ బెలూన్ గాల్లోనే పేలిపోయి కూలిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది పర్యాటకులు మృత్యువాతపడినట్టుగా తెలిసింది. ప్రమాద సమయంలో హాట్ ఎయిర్ బెలూన్ లో మొత్తం 22 మంది పర్యాటకులు ఉన్నట్టుగా సమాచారం. బ్రెజిల్ లోని దక్షిణ రాష్ట్రమైన శాంటా కాటరినాలో ఈ ప్రమాదం జరిగినట్టుగా అక్కడి సంబంధిత అధికారులు వెల్లడించారు.

శనివారం తెల్లవారుజామున టూరిజం హాట్ ఎయిర్ బెలూన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగి ప్రియాగ్రాండే నగరంలో కూలిపోయిందని స్థానిక అగ్నిమాపక శాఖ తెలిపింది. ఈ ప్రమాదంలో 13మంది ప్రాణాలతో బయటపడ్డారు. వారిని సమీప ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లుగా తెలిపారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

సావో పాలో రాష్ట్రంలో ఇలాంటి బెలూన్ ప్రమాదం జరిగిన వారం రోజులకే ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మరణించగా, 11 మంది గాయపడ్డారు. పండుగ సమయం విమానాల రాకపోకల నేపథ్యంలో ఇలాంటి హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ పర్యటన భద్రత పట్ల ప్రయాణికులు, పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తు్న్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..