
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో ఉద్యోగాలు ఊడిపోతాయేమోనన్న భయం ప్రపంచ వ్యాప్తంగా తీవ్రమవుతోంది. ఉపాధిపై AI సంభావ్య ప్రభావం గురించిన భయం ఇప్పుడు అమెరికన్లలోనూ వెల్లడవుతోంది. అమెరికాలో జరిపిన ఆరు రోజుల సర్వేలో 71% మంది ఉద్యోగులు AI శాశ్వతంగా జాబ్‌లను తొలగిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలు, పరిశ్రమలపై పెరుగుతున్న సాంకేతికత అభివృద్ధి తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది జూలైలో US నిరుద్యోగిత రేటు 4.2 శాతంగా ఉంది. అక్కడ నిరుద్యోగ రేటు స్వల్పంగా ఉన్నప్పటికీ అమెరికన్ పౌరులలో భయందోళనలు రేకెత్తుతున్నాయి. ముఖ్యంగా ఉపాధికి మించి AIతో తలెత్తే సామాజిక, నైతిక చిక్కుల గురించి అమెరికన్లు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లో గందరగోళాన్ని సృష్టించడానికి AI టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నట్లు 77% మంది భయపడుతున్నారు. ఇది డీప్‌ఫేక్ వీడియోలు, తప్పుడు సమాచారంపై ఆందోళనలను ప్రతిబింబిస్తుంది. సైనిక వ్యవహారాల్లోనూ ఇది ఆందోళనను రేకెత్తిస్తుంది. సైనిక దాడులను లక్ష్యంగా చేసుకోవడానికి AIని ప్రభుత్వం ఉపయోగించడాన్ని 48% మంది వ్యతిరేకిస్తున్నారు. మిగిలిన 28% మంది న్యూట్రల్‌గా ఉన్నారు.
పర్యావరణ ప్రభావం మరొక వర్క్ ఫోర్స్ సంబంధిత ఆందోళనకు కారణమవుతోంది. శక్తి-ఇంటెన్సివ్ డేటా సెంటర్లు పవర్ గ్రిడ్‌లను దెబ్బతీస్తున్నందున.. AI విద్యుత్ డిమాండ్ల గురించి దాదాపు 61% మంది అమెరికన్లు ఆందోళన చెందుతున్నారు. గూగుల్ వంటి కంపెనీలు గరిష్ట డిమాండ్ సమయంలో AI డేటా సెంటర్ వినియోగాన్ని తగ్గించడానికి యుటిలిటీలతో ఒప్పందాలు వంటి పరిష్కారాలను వెతుకుతున్నాయి. సామాజిక, నైతిక ప్రభావాల గురించి ప్రజల వైఖరులు కూడా ఆందోళనలను ప్రతిబింబిస్తున్నట్లు సర్వే తెలిపింది. మూడింట రెండు వంతుల మంది AI సహచరులు మానవ సంబంధాలను భర్తీ చేస్తారని భయపడుతున్నారు. ఇక AI విద్య అవసరాలను మెరుగుపరచగలదా అనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ సర్వేలో దాదాపు 4,446 మంది US ఆఫీషియల్స్ నుంచి ఆన్‌లైన్ ప్రతిస్పందనలను సేకరించడం జరిగింది. మెటా, ఆల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాలలో AI స్వీకరణ వేగవంతం అవుతుంది. అయినప్పటికీ ఉపాధి, సామాజిక విలువలు, పర్యావరణం వంటి విషయాలపై ఏఐ ప్రభావాల గురించి అమెరికన్లు కాస్త జాగ్రత్తగానే ఉంటారని సర్వే వెల్లడించింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.