Explosion In Istanbul: భారీ పేలుడుతో ఉలిక్కిపడిన ఇస్తాంబుల్.. ఆరుగురు దుర్మరణం.. 81 మందికి..

ఆత్మాహుతి దాడితో టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌ వణికింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోగా.. మరో 81 మంది గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Explosion In Istanbul: భారీ పేలుడుతో ఉలిక్కిపడిన ఇస్తాంబుల్.. ఆరుగురు దుర్మరణం.. 81 మందికి..
Explosion In Istanbul

Updated on: Nov 14, 2022 | 5:16 AM

ఆత్మాహుతి దాడితో టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌ వణికింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోగా.. మరో 81 మంది గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఇస్తాంబుల్ నగరంలోని ప్రముఖ ఇస్తిక్‌లాల్ అవెన్యూ వద్ద ఈ పేలుడు జరిగిందని పోలీసులు తెలిపారు. వెంటనే ఘటనాస్థలికి అంబులెన్సులు, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు పోలీసులు. పేలుడు జరిగిన తర్వాత ప్రాంతంలో ప్రజలు భయంతో పరిగెత్తారు. అక్కడ ఉన్న దుకాణాలను వెంటనే మూసివేశారు. పేలుడు కారణంగా ఏడుగురు మరణించినట్లు ఇస్తాంబుల్ గవర్నర్‌ అలీ యెర్లికాయ ట్వీట్‌ చేశారు. స్థానిక కాలమానం ప్రకారం నిన్న సాయంత్రం 4 గంటల 20 నిమిషాలకు ఈ ఘటన జరిగింది. ఇస్తాంబుల్‌లో ఈ మార్కెట్‌ ప్రాంతం పర్యాటకులు, స్థానికులతో ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది.

ఈ ఘటనను టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్‌ ఖండించారు. ఉగ్రదాడిగా అనుమానిస్తున్నామని తెలిపారు. ఘటనలో భాగమైన నేరస్తులను గుర్తించేందుకు సంబంధిత విభాగాలు తీవ్రంగా పనిచేస్తున్నాయని వెల్లడించారు. ఈ పేలుడు తర్వాత బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని.. బాధితులను ఆసుపత్రికి తరలించారు. ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు టర్కీ వైస్ ప్రెసిడెంట్ ఫుట్ ఆక్టే తెలిపారు.

ఇవి కూడా చదవండి

కాగా.. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పేలుడు ధాటికి జనం పరుగులు తీస్తూ కనిపించారు. కాగా, పేలుడుకు గల కారణాలపై ఇంకా అధికారులు స్పందించాల్సి ఉంది.

2015-2016లో ఇస్తాంబుల్‌ను లక్ష్యంగా చేసుకున్న దాడుల్లో గతంలో ఇస్తిక్‌లాల్ స్ట్రీట్ దెబ్బతింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు జరిపిన ఆ దాడుల్లో దాదాపు 500 మంది మరణించారు, 2,000 మందికి పైగా గాయపడ్డారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..